దీపావళి మొబైల్స్ ధమాకా...!!

Posted By: Staff

దీపావళి మొబైల్స్ ధమాకా...!!

దీపావళి హిందువుల సాంప్రదాయమైన పండుగ. నరకాసురుడిని సత్యభామ యుద్దంలో చంపిన సందర్బంగా ఈ పండుగని మనం అందరం చేసుకుంటాం. ఈ దీపావళి పండుగకు ఓ ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత ఏమిటంటే అన్ని పండుగల మాదిరి కాకుండా ఈ దీపావళి రోజున ఉదయం ఐదు గంటలకు లేచి, తలస్నానం చేసి పూజామందిరంతో పాటు ఇంటిని శుభ్రం చేసుకోని, గడపకు కుంకుమ, గుమ్మానికి తోరణాలు కట్టి అందంగా తీర్చి దిద్దాలి. ఆ తర్వాత తెలుపు బట్టలు ధరించి మన ఇష్టదైనమైన లక్క్ష్మీదేవిని ఇష్టంగా పూజించాలి.

ఆ తర్వాత ఇంట్లో ఆడవారు పిండి వంటలతో తలమనకలైతే మరి మగవారం మనం ఏమి చేయాలి. కాబట్టి మనం అలా సరదాగా షాపింగ్ వైపుకి ఓ కన్నేసి వద్దాం పదండి. సాధారణంగా దీపావళికి ప్రతి ఆఫీసులలోను బోనస్‌లు అంటూ హాడావుడి ఉంటుంది. కాబట్టి బోనస్ వచ్చిన డబ్బులతో ఇంట్లోకి ఓ కొత్త వస్తువుని తెచ్చుకొవడానికి ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ముఖ్యంగా ఇంట్లోకి వచ్చే వస్తువు ఇనుముకి చెందినదైతే మంచి జరుగుతుందని ప్రజల అభిప్రాయం. దీపావళిని క్యాష్ చేసుకునేందుకు గాను చాలా షాపింగ్ మాల్స్ కొత్త కొత్త ఆఫర్స్‌ని దీపావళి బోనాంజా, దీపావళి ధమాకా అంటూ ప్రవేశపెట్టడం జరుగుతుంది.

ఈ దీపావళికి పలు రకాల మొబైల్ కంపెనీలు కొత్త మొబైల్ ఫోన్లను విడుదల చేయడమే కాకుండా గిప్ట్‌లు లాంటి వాటిని కూడా ప్రకటించడం జరిగింది. దీపాల పండుగగా పిలుచుకునే ఈ దీపావళికి యూజర్స్ కొసం మొబైల్ తయారీదారులు కొత్త మొబైల్ మోడళ్లను విడుదల చేయడమే కాకుండా, ఆఫర్ రేట్స్‌ని కూడా ప్రకటించడం జరిగింది. దీపావళి సందర్బంగా ఏయే మొబైల్ తయారీదారులు కొత్త మొబైల్స్‌ని విడుదల చేస్తున్నాయో వాటి గురించి ఒక లుక్ వేద్దాం..

నోకియా: ఇండియన్స్‌కు అత్యంత ప్రీతి పాత్రమైన మొబైల్ కంపెనీ నోకియా. యూజర్స్ కొసం ప్రత్యేకంగా నోకియా ఈ దీపావళికి కొత్త ఆఫర్స్‌ని విడుదల చేసింది. వీటి గురించి తెలుసుకొవాలంటే దగ్గరలో ఉన్న నోకియా షోరూమ్‌కి వెళ్లాల్సిందే. ఇక నోకియా కొత్తగా యూజర్స్ కొసం ఈ దీపావళికి స్మార్ట్ పోన్స్‌(నోకియా 603, నోకియా 701, నోకియా సి5-06, నోకియా సి5-06)ని విడుదల చేస్తుంది. ఈ మొబైల్ ఫోన్స్‌కి సంబంధించిన ధరలు ప్రత్యేకంగా..

నోకియా 603 మొబైల్ ధర: 15,000/-
నోకియా 701 మొబైల్ ధర: 19,000/-
నోకియా సి5-05 మొబైల్ ధర: 18,000/-(సుమారుగా ఉండవచ్చునని అంచనా మాత్రమే)
నోకియా సి5-06 మొబైల్ ధర: 17,000/-(సుమారుగా ఉండవచ్చునని అంచనా మాత్రమే)

మోటరోలా: ఇక మోటరోలా కంపెనీ దీపావళికి తాను ఏమి తక్కువ తిన్నానని అని మోటరోలా ఫైర్, మోటరోలా ఫైర్ ఎక్స్ టి అనే రెండు స్మార్ట్ పోన్స్‌ని యూజర్స్ కోసం అందిస్తుంది. ఈ రెండు మొబైల్స్‌ కూడా ఇండియాలో ఉన్న మద్యతరగతి కుటుంబాలకు సరిగ్గా సరిపోతాయి. వారిని దృష్టిలోపెట్టుకోని ఈ రెండు మొబైల్స్‌ని కూడా మార్కెట్లోకి విడుదల చేయడం జరిగింది.

మోటరోలా ఫైర్ మొబైల్ ధర: రూ 9,000/-
మోటరోలా ఫైర్ ఎక్స్‌టి మొబైల్ ధర: రూ 12,000/-

శ్యామ్‌సంగ్: శ్యామ్ సంగ్ కంపెనీ కూడా బడా 2.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అయ్యేటటువంటి మూడు స్మార్ట్ పోన్స్‌ని విడుదల చేసింది. వాటి పేర్లు వరుసగా శ్యామ్ సంగ్ వేవ్ 3, శ్యామ్ సంగ్ వేవ్ ఎమ్, శ్యామ్ సంగ్ వేవ్ వై. ఈ మూడు మొబైల్స్‌ని దీపావళికి ప్రత్యేకంగా యూజర్స్‌ని దృష్టిలో పెట్టుకోని విడుదల చేయడం జరుగుతుంది.

శ్యామ్‌సంగ్ వేవ్ 3 మొబైల్ ధర: 17,000/-(సుమారుగా ఉండవచ్చునని అంచనా మాత్రమే)
శ్యామ్‌సంగ్ వేవ్ ఎమ్ మొబైల్ ధర: 18,000/-(సుమారుగా ఉండవచ్చునని అంచనా మాత్రమే)
శ్యామ్‌సంగ్ వేవ్ వై మొబైల్ ధర: 19,000/-(సుమారుగా ఉండవచ్చునని అంచనా మాత్రమే)

ఇలా మీకు దగ్గరలో ఉన్న అన్ని షాపింగ్ మాల్స్‌లలోకి వెళ్లి చక్కగా షా

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot