ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5

Posted By:

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ తన ఫ్లాగ్‌షిప్ మోడల్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్5ను గురువారం ఇండియన్ మార్కెట్లో ఆవిష్కరించింది. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ డివైస్ ధర రూ.51,000 నుంచి రూ.53,000 మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. మార్చి 29 నుంచి ఈ స్మార్ట్  డివైస్‌కు సంబంధించి ప్రీఆర్డర్లను స్వీకరించనున్నారు. సామ్‌సంగ్ ఇండియన్ ఆన్‌లైన్ స్టోర్ ద్వారా డివైస్ ఏప్రిల్ 11 నుంచి విక్రయించనున్నారు. ఇదే సమయంలో తక్కిన ఈ-కామర్స్ వెబ్‌సైట్‌లు కూడా గెలాక్సీ ఎస్5ను విక్రయించే అవకాశం ఉంది.

ఇండియన్ మార్కెట్లోకి సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5

ఇండియన్ మార్కెట్లో విడుదల కాబోయే గెలాక్సీ ఎస్5 వర్షన్ ఎక్సినోస్ 5420 ఆక్టా కోర్ సీపీయూ వ్యవస్థను కలిగి ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో బహుళ ఉపయోగకర ఫింగర్ ప్రింట్ సెన్సార్, అలానే ఫోన్ వెనుక భాగంలో హార్ట్ - రేట్ సెన్సార్‌ను ఏర్పాటు చేసారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను సెక్యూరిటీ అలానే పేపాల్ ద్వారా బిల్లులు చెల్లించే సమయంలో ఉపయోగించుకోవచ్చు.

గెలాక్సీ ఎస్5 కీలక స్పెసిఫికేషన్‌లు:

5.1 అంగుళాల డిస్‌ప్లే (1080 పిక్సల్ సూపర్ అమోల్డ్ ప్యానల్), ఐపీ67 సర్టిఫికేషన్ (వాటర్ ఇంకా డస్ట్ ప్రూఫ్), 16 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా సెన్సార్ (అల్ట్రా హైడెఫినిషన్ రికార్డింగ్, ఫోటోలు ఇంకా వీడియోలను రియల్ టైమ్ హైడెఫినిషన్ రికార్డింగ్‌తో క్యాప్చర్ చేసుకునే సదుపాయం), 2.5గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 800 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, ఐఆర్ రిమోట్, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (ఎన్ఎఫ్‌సీ), బ్లూటూత్ 4.0 బీఎల్ఈ/ఏఎన్‌టీ+, క్యాట్ 4 ఎల్టీఈ, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 64జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot