నవశకానికి నాంది పలికిన గెలాక్సీ ‘ఎస్’ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు

|

గడిచిన 5 సంవత్సరాల కాలంగా స్మార్ట్‌ఫోన్ ఇండస్ట్రీ అసాధారణ వృద్ధి రేటుతో దూసుకుపోతోంది. స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీలో చోటు చేసుకుంటోన్న విప్లవాత్మక మార్పులు సరికొత్త ఆవిష్కరణలకు ఊపిరి పోస్తున్నాయి. ప్రపంచపు నెం.1 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా గుర్తింపు తెచ్చుకున్న సామ్‌సంగ్, ఈ 5 సంవత్సరాల పిరియడ్‌లో అత్యుత్తమ స్మార్ట్‌ఫోన్ టెక్నాలజీని మార్కెట్‌కు అందించే ప్రయత్నం చేసింది.

 
నవశకానికి నాంది పలికిన గెలాక్సీ ‘ఎస్’ సిరీస్  స్మార్ట్‌ఫోన్‌లు

బడ్జెట్, మిడ్-రేంజ్, హై-ఎండ్ సెగ్మెంట్‌లను టార్గెట్ చేస్తూ ఈ బ్రాండ్ లాంచ్ చేసిన పలు స్మార్ట్‌ఫోన్‌లు ఓ ట్రెండునే సృష్టించాయి. ముఖ్యంగా గెలాక్సీ 'ఎస్’ సిరీస్ నుంచి సామ్‌సంగ్ లాంచ్ చేసిన ప్రతీ స్మార్ట్‌ఫోన్ ఇన్నోవేటిక్ కాన్సెప్ట్‌కు అద్దం పట్టింది. 2010 నుంచి ప్రారంభమైన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ల ప్రస్థానం హిట్టూ, ఫ్లాపులతో సంబంధం లేకుండా అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడాదికో సంచలనంతో మారిమోగిపోతోంది. గెలాక్సీ ఎస్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు అంచెలంచెలుగా విస్తరించిన తీరును ఇప్పుడు తెలుసుకుందాం..

సామ్‌సాంగ్ గెలాక్సీ ఎస్

సామ్‌సాంగ్ గెలాక్సీ ఎస్

సామ్‌సంగ్ తన మొట్టమొదటి గెలాక్సీ ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను 2010లో అనౌన్స్ చేసింది. 4 అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్‌ప్లేతో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ హమ్మింగ్‌బర్డ్ చిప్‌సెట్ పై రన్ అవుతుంది. ఈ కాంభినేషన్ అంతగా పర్‌‌ఫెక్ట్ కానప్పటికి గెలాక్సీ ఎస్ ఫోన్ సిరీస్‌కు గొప్ప ఆరంభాన్ని ఇచ్చింది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2

2011, ఏప్రిల్ 28న ప్రపంచానికి పరిచయమైన సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్2 స్మార్ట్‌ఫోన్, 2012 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ‘స్మార్ట్‌ఫోన్ ఆఫ్ ద ఇయర్' అవార్డును గెలుచుకుంది. 8.49 మిల్లీమీటర్ల మందంతో రూపుదిద్దుకున్న ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ అదే ఏడాదికిగాను బెస్ట్ స్లిమ్ ఫోన్‌గా నిలిచింది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3
 

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్3

గెలాక్సీ ఎస్2కు సక్సెసర్ వర్షన్‌గా 2012, మే 22న మార్కెట్లో లాంచ్ అయిన గెలాక్సీ ఎస్3 పెర్ఫామెన్స్ పరంగా ఇరగతీసినప్పటికి ప్లాస్టిక్ బాడీతో నిరుత్సాహపరిచింది. రిఫైనిడ్ టచ్‌విచ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో అత్యుత్తమ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ ఫోన్ అందించింది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్4

గెలాక్సీ ఎస్3కి సక్సెసర్ వర్షన్‌గా 2013, ఏప్రిల్ 23న మార్కెట్లో లాంచ్ అయిన గెలాక్సీ ఎస్4 ఇంటర్నల్ స్పెసిఫికేషన్స్ పరంగా ఆకట్టుకున్నప్పటికి ప్లాస్టిక్ డిజైనింగ్ పరంగా క్రిటిక్స్ నుంచి నెగిటివ్ రివ్యూలను అందుకుంది. రిఫైనిడ్ టచ్‌విచ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌తో అత్యుత్తమ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌ను ఈ ఫోన్ అందించింది.

Facebook డిజిటల్ అసిస్టెంట్‌ని మూసివేస్తోంది, చివరి రోజు ఈ నెల 19 !Facebook డిజిటల్ అసిస్టెంట్‌ని మూసివేస్తోంది, చివరి రోజు ఈ నెల 19 !

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్5

సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ నుంచి 2014లో లాంచ్ అయిన మరో ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్5. వాటర్ ఇంకా డస్ట్ రెసిస్టెంట్ ఫీచర్స్‌తో లాంచ్ అయిన ఈ స్మార్ట్‌ఫోన్ హార్డ్‌వేర్ ఇంకా సాఫ్ట్‌వేర్ పరంగా బెస్ట్ బెంచ్ మార్కింగ్ స్కోర్‌ను నమోదు చేయగలిగింది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 సిరీస్

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్6 సిరీస్

గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని డిజైనింగ్ పై ప్రముఖంగా ఫోకస్ చేస్తూ సామ్‌సంగ్ లాంచ్ చేసిన గెలాక్సీ ఎస్6, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో బంపర్ హిట్టు కొట్టాయి. గ్లాస్ ఇంకా మెటల్ బాడీ కాంభినేషన్‌లో లాంచ్ అయిన ఈ ఫోన్ క్రిటిక్స్ నుంచి సైతం పాజిటివ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంది.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 సిరీస్

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్7 సిరీస్

గెలాక్సీ ఎస్ 6 సిరీస్ ఇచ్చిన మంచి ఊపుతో సామ్‌సంగ్ అందుబాటులోకి తీసుకువచ్చిన గెలాక్సీ ఎస్7 సిరీస్ అంతకు మించిన ఫీచర్లతో మార్కెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌గా నిలిచింది. ఈ ఫోన్‌లోని డ్యుయల్ కర్వుడ్ స్ర్కీన్, ప్రాసెసర్, కెమెరా, బ్యాటరీ వంటి ఫీచర్లు సరికొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 సిరీస్

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్8 సిరీస్

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ సిరీస్ నుంచి ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ అయిన గెలాక్సీ ఎస్8, గెలాక్సీ ఎస్8 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు 18.5:9 యాస్పెక్ట్ రేషియో డిస్‌ప్లేతో నవశకానికి నాంది పలికాయి. బిక్స్‌బీ వర్చువల్ అసిస్టెంట్ ఫీచర్‌తో పాటు ఐరిస్ స్కానర్, ఫింగర్ ప్రింట్ స్కానర్, షేషియల్ రికగ్నిషన్ వంటి ఫీచర్లు ఈ ఫోన్‌కు ప్రధానమైన హైలెట్ నిలిచాయి. గెలాక్సీ ఎస్8 సిరీస్‌కు కొనసాగింపుగా ఈ ఏడాది మార్కెట్లో లాంచ్ కాబోతోన్న గెలాక్సీ ఎస్9 విప్లవాత్మక ఫీచర్లను ప్రపంచానికి పరిచయం చేయబోతోంది.

Best Mobiles in India

Read more about:
English summary
The smartphone industry has witnessed an amazing growth in the past four to five years with the invention of new technology in various departments. In this article, we have compiled the evolution of Samsung S series.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X