ప్రాంతీయ భాషలే ప్రధానంగా మోఫస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

ఇండియన్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు భాష ప్రధాన అవరోధంగా నిలుస్తున్న నేపధ్యంలో భారత్ కు చెందిన టెక్నాలజీ స్టార్టప్ మోఫస్ట్ (MoFirst ) ప్రాంతీయ భాషలు ఆధారంగా స్పందించే సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తోంది. ఈ కంపెనీ రూపకల్పన చేసిన ప్రత్యేకమైన టెక్నాలజీ ద్వారా కేవలం ఒక్క స్వైప్‌తో ఒక భాష నుంచి మరోక భాషకు తక్షణమే మారిపోవచ్చు.

 ప్రాంతీయ భాషలే ప్రధానంగా మోఫస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు

దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లను మార్చి 2015 నాటికి దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తామని మోఫస్ట్ సొల్యూషన్స్ సహ వ్యవస్థాపకులు ఇంకా సీఈఓ రాకేష్ దేశ్‌ముఖ్ పీటీఐకు వెల్లడించారు. మోఫస్ట్ సొల్యూషన్స్ కంపెనీని 2008లో ప్రారంభించారు. ఈ కంపెనీ ఫస్టచ్ బ్రాండ్ క్రింద స్మార్ట్‌ఫోన్‌లను తయారు చేస్తోంది. ఈ ఫోన్‌లలో ఇన్స్‌స్టాల్ చేసే ప్రత్యేకమైన ట్రాన్స్‌లేషన్ టెక్నాలజీ ఆంగ్లపదాలను ఇట్లే ప్రాంతీయ భాషాల్లోకి అనువదిస్తుంది.

జూలై నాటికి హిందీ అలానే మరాఠీ భాషలను సపోర్ట్ చేసే హ్యాండ్‌సెట్‌లను సెప్టంబర్ నాటికి తెలుగు, తమిళం అలానే బెంగాలీ భాషలను సపోర్ట్ చేసే హ్యాండ్‌సెట్‌లను నవంబర్ నాటికి కన్నడ అలానే మళయాళీ భాషలను సపోర్ట్ చేసే హ్యాండ్‌సెట్‌లను, మిగిలిన ప్రాంతీయ భాషలను సపోర్ట్ చేసే ఫోన్‌లను మార్చి 2015 నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot