మీ మొబైల్ బ్యాటరీ ఎప్పుడు పూర్తి చార్జింగ్‌తో ఉండాలంటే..?

Posted By: Prashanth

మీ మొబైల్ బ్యాటరీ ఎప్పుడు పూర్తి చార్జింగ్‌తో ఉండాలంటే..?

 

మార్గ మధ్యంలో ఉన్నారు.. అత్యవసరంగా మీ కుటుంబ సభ్యలకు ఫోన్ చేయాల్సి వచ్చింది.. ఫోన్ చేద్దామనుకునే సమయంలో చార్జింగ్ లేని కారణంగా మీ ఫోన్ స్విచాఫ్ అయింది. ఈ పరిస్థితుల్లో ఏం చేస్తారు..?

అత్యవసర సమయాల్లో చార్జింగ్ సమస్య నుంచి నిశ్చింతగా ఉంచేందుకు మోజో వైర్‌లెస్ చార్జర్ మార్కెట్లో విడుదలైంది. దీని ధర రూ.1000. ఈ పోర్టబుల్ డివైజ్‌ను పూర్తి స్థాయిలో చార్జ్ చేసుకుని మీ వెంటతీసుకెళితే సరిపోతుంది. మీ మొబైల్‌కు చార్జింగ్ అవసరమైన సమయంలో మోజో చార్జర్‌కు కేబుల్ఆధారితంగా అనుసంధానిస్తే సరిపోతుంది.

మోజో చార్జర్‌లో ఏర్పాటు లెవల్ ఇండికేటర్ టెక్నాలజీ మీ మొబైల్ బ్యాటరీ స్థాయిని గుర్తించి వెంటనే కావల్సిన సామర్ధ్యాన్ని సమకూరుస్తుంది. మోజో వైర్‌లెస్ చార్జర్‌తో అన్ని రకాల పోర్టబుల్ డివైజ్‌లకు అత్యవసర సమయాల్లో శక్తిని సమకూర్చవచ్చు. శక్తవంతమైన 2200mAh లయాన్ రీఛార్జబుల్ బ్యాటరీలను ఈ కార్డ్‌లెస్ ఛార్జర్‌లో నిక్షిప్తం చేయ్యటం కారణంగా విద్యుత్ నిల్వ ఉంటుంది. ఈ విద్యుత్‌ను ఛార్జింగ్ అవసరమైన వాటిలోకి చిన్న కేబుల్ ఆధారితంగా షేర్ చేసుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో మోజో కార్డ్‌లెస్ స్పీకర్ ధర రూ.1000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot