మనుషులు కన్నా మొబైల్ పరికరాలే ఎక్కువ..!

Posted By: Prashanth

మనుషులు కన్నా మొబైల్ పరికరాలే ఎక్కువ..!

 

న్యూయర్క్: అవును.. ఇది మింగుడు పడని వాస్తవం!! ప్రపంచ జనాభాను అధిగమించే స్థాయికి టెక్నాలజీ చేరబోతోంది. 2016 నాటికి మానవులు కన్నా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు వంటి మొబైల్ అనుసంధాన పరికరాలే ఎక్కువగా ఉంటాయని అమెరికా కంపెనీ సిస్కో నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. 2016 నాటికి మొబైల్ పరికరాల సంఖ్య వెయ్యి కోట్లకు చేరుతుందని, అప్పటికి ప్రపంచ జనాభా 730 కోట్లే ఉంటుందని నివేదికలో అధ్యయన బ్ళందం వెల్లడించింది. 2016 నాటికి మొబైల్ వినియోగదారుల్లో 60 శాతం మంది గిగాబైట్ క్లబ్‌లో ఉంటారు. వీరు నెలకు ఒక గిగా‌బైట్ మేర మొబైల్ డేటా ట్రాఫిక్‌ను ఉత్పత్తి చేస్తారని సిస్కో ఉపాధ్యక్షుడు సూరజ్ షెట్టి తెలిపారు. 2011లో గిగాబిట్ క్లబ్ వాడుక 1 శాతం మాత్రమేనని, స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ పీసీల రాకతో ఈ వాడకం మరింత విస్త్ళతమైందని షెట్టీ తెలపారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot