నాలుగే ఫీచర్లతో Light Phone 2, ధర మాత్రం రూ. 26 వేలు

మొబైల్ కొనుగోలు సమయంలో ఎవరైనా ఏం చూస్తారు..అందులో ఏం ఫీచర్లు ఉన్నాయా అని వెతుకుతుంటారు కదా.

|

మొబైల్ కొనుగోలు సమయంలో ఎవరైనా ఏం చూస్తారు..అందులో ఏం ఫీచర్లు ఉన్నాయా అని వెతుకుతుంటారు. camera, our map, our bank card, our diary, musicఅలాగే ఇతర ఫీచర్లు లాంటివి ఏమైనా ఉన్నాయా అని చూసి కొంటారు. అయితే అలాంటివేమి లేకుండా ఓ నాలుగు ఫీచర్లతో మొబైల్ వస్తే ఎలా ఉంటుంది. అది భారీ ధరలో మార్కెట్లోకి వస్తే ఎవరైనా కొనుగోలు చేస్తారా..అయితే అలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మీరు క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉన్న ఈ ఫోన్ మీద ఓ లుక్కేయాల్సిందే. ఇంకా ఆసక్తికర ఏంటంటే 5వేలు పెట్టి కొనుక్కునే ఫోన్‌లోనే అన్ని ఫీచర్లుండాలని భావించే వారు ఈ ఫోన్ గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు కూడా.

షియోమి నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్, మార్చి 14న విడుదలషియోమి నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్, మార్చి 14న విడుదల

లైట్ అనే ఫోన్ల తయారీ కంపెనీ..

లైట్ అనే ఫోన్ల తయారీ కంపెనీ..

అమెరికాకు చెందిన లైట్ అనే ఫోన్ల తయారీ కంపెనీ కొత్తగా Light Phone 2 పేరుతో ఓ ఫోన్‌ను తయారుచేసింది. ఈ ఫోన్ క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉంటుంది. బ్లాక్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ లభ్యమవుతోంది. ఈ ఫోన్లో మీకు ఎటువంటి యాప్స్ కనిపించవు.

ధర

ధర

ఫోన్ ధర భారత కరెన్సీలో 26,000 రూపాయలు. పాతికవేలకు పైగా ధర అంటున్నారు కాబట్టి ఫీచర్లు ఓ రేంజ్‌లో ఉంటాయని భావించడం సహజం. కానీ ఈ ఫోన్‌ వల్ల మూడేమూడు ఉపయోగాలున్నాయి. ఫోన్లు చేసుకోవచ్చు. సందేశాలు పంపించుకోవచ్చు. అలారం సెట్ చేసుకోవచ్చు. ఈ ఫోన్ 4జీ ఎల్‌టీఈని సపోర్ట్ చేస్తుంది

యాప్స్

యాప్స్

ఇందులో కెమెరా ఉండదు. అలాగే యాప్స్ ఇన్‌స్టాల్ చేసుకునే సదుపాయం లేదు. స్మార్ట్‌ఫోన్ ఫీచర్లకు అలవాటు పడిన వారికి ఈ ఫోన్ గురించి తెలిస్తే విడ్డూరంగానే అనిపిస్తోంది. అయితే కంపెనీ ఏమంటుదంటే స్మార్ట్ ఫోన్ ప్రపంచం నుంచి బయటకు రావాలనుకునే వారికి మా ఫోన్ బాగా ఉపయోగపడుతుందని చెబుతోంది.

మీ బంధాలను మరింత పటిష్టం చేసుకోవచ్చని ..

మీ బంధాలను మరింత పటిష్టం చేసుకోవచ్చని ..

ఈ ఫోన్ తో మీరు మీ బంధాలను మరింత పటిష్టం చేసుకోవచ్చని చెబుతోంది. సోషల్ మీడియాకు దూరంగా ఉంటూ మిమ్మల్ని మీరు నియత్రించుకునేందుకు ఈ ఫోన్ చాలా బాగా ఉపయోగపడుతుందని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది.

10 వేల ఫోన్లు..

10 వేల ఫోన్లు..

కాగా ఇప్పటికే 10 వేల ఫోన్లు యుఎస్ మార్కెట్లో అమ్ముడుపోయాయట. ఇంకా ఆర్డర్లు వస్తున్నాయని రోజు రొజుకు ఈ ఫోన్ డిమాండ్ పెరుగుతోందని కంపెనీ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది.

రెండవ ప్రొడక్ట్.

రెండవ ప్రొడక్ట్.

ఈ కంపెనీ నుంచి ఇది రెండవ ప్రొడక్ట్. ఫస్ట్ వచ్చిన ఫోన్ కేవలం కాల్స్ మాత్రమే చేసుకునే వెసులుబాటు ఉంది. అయితే ఈ ఫోన్ కొన్ని మెరుగులను దిద్దుకుని వచ్చింది. కాల్స్ తో పాటు మరో మూడు రకాల ఫీచర్లను జోడించుకుంది. 

వేయి రూపాయల ఫోన్లో కూడా..

వేయి రూపాయల ఫోన్లో కూడా..

సో.. స్మార్ట్ ఫోన్ కి అడిక్ట్ అయిన వారు ఈ ఫోన్ రూ. 26 వేల రూపాలయతో కొనుగోలు చేయవచ్చు.అయితే ఈ ఫీచర్లు వేయి రూపాయల ఫోన్లో కూడా దొరుకుతున్నాయనే సందేహం రావచ్చు. కాకుంటే లగ్జరీ ఫోన్లకు అలవాటు పడిన వారికోసం ఈ ఫోన్ అని చెప్పవచ్చు. 

Best Mobiles in India

English summary
New 'dumb' phone has just been revealed - and it can only do four things More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X