Flipkart లో ఎక్కువగా వెతికిన ఫోన్లు ఇవే ! లిస్ట్ చూడండి.

By Maheswara
|

భారతదేశంలో స్మార్ట్ఫోన్ పరిశ్రమ బహుళ ఎంపికలతో విభిన్నమైనది. కొన్నిసార్లు, ఈ ఎంపికలు చాలా గందరగోళంగా ఉంటాయి. అలాగే మన భారతీయుల అభిరుచులు కూడా ప్రత్యేకంగా ఉంటాయి. ప్రత్యేకించి మీరు మీ అవసరాలుకు తగినట్లు మరియు బడ్జెట్‌ను దృష్టిలో ఉంచుకొని స్మార్ట్ఫోన్ ను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు. ఆసక్తికరంగా, ఎక్కువ శాతం మంది ప్రజలు డిమాండ్ చేసిన అత్యంత ప్రజాదరణ పొందిన స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయని తెలుస్తోంది.

ఫ్లిప్‌కార్ట్‌

స్మార్ట్ ఫోన్లు కొనాలంటే మొదటగా గుర్తుకు వచ్చేది ఆన్లైన్ మాధ్యమాలు అయిన ఫ్లిప్‌కార్ట్‌ మరియు అమెజాన్. ఇప్పుడు మనము ఫ్లిప్కార్ట్ లో వినియోగదారులు ఎక్కువగా శోధించిన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాను తయారు చేసాము.మీకోసం ఈ ఫోన్ల వివరాలు ఇస్తున్నాము.

ఆపిల్ ఐఫోన్ సిరీస్‌

ఆపిల్ ఐఫోన్ సిరీస్‌

మొదటగా ఆపిల్ ఐఫోన్ సిరీస్‌తో ప్రారంభిద్దాం. ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువగా శోధించిన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో ఐఫోన్ 8, ఐఫోన్ 7 మరియు ఐఫోన్ 7 ప్లస్‌లతో సహా పలు ఐఫోన్ పరికరాలు ఉన్నాయి. ఇవి కొంచెం పాతవి అయినప్పటికీ, అవి ఇప్పటికీ భారతీయ కొనుగోలుదారులలో బాగా ప్రాచుర్యం పొందాయి, ప్రధానంగా తక్కువ ధరకు ఐఫోన్ లభిస్తుండటం ఇందుకు కారణం.

Also Read: Xiaomi 200W హైపర్‌ఛార్జ్ టెక్నాలజీ ఆవిష్కరణ!! 8minలో బ్యాటరీ ఫుల్ ఛార్జ్...Also Read: Xiaomi 200W హైపర్‌ఛార్జ్ టెక్నాలజీ ఆవిష్కరణ!! 8minలో బ్యాటరీ ఫుల్ ఛార్జ్...

iPhone 8

iPhone 8

గ్లాస్ ఇంకా అల్యుమినియమ్ డిజైన్, 4.7 అంగుళాల రెటీనా హైడెఫినిషన్ డిస్ ప్లే వితో ట్రో టోన్, iOS 11 ఆపరేటింగ్ సిస్టం, యాపిల్ ఏ11 బయోనిక్ చిప్‌సెట్, స్టోరేజ్ వేరియంట్స్ (64జీబి, 256జీబి), 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, క్వాడ్-ఎల్ఈడి ట్రు టోన్ ఫ్లాష్, టచ్ ఐడీ, ఎల్టీఈ అడ్వాన్సుడ్, బ్లుటూత్ 5.0, స్టీరియో స్పీకర్స్, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్, వైర్‌లెస్ ఛార్జింగ్ తో వస్తుంది

iphone 7 ప్లస్ ఫోన్ ,  5.5అంగుళాల రెటినా హెచ్ డి డిస్ ప్లే 3డి టచ్ , క్వాడ్ కోర్ ఆపిల్ ఏ10 ఫ్యూజన్ ప్రొసెసర్ , 2జిబి ర్యామ్ 32/128/256జిబి రామ్ , ఫోర్స్ టచ్ టెక్నాలజీ , డ్యయల్ 12మెగాపిక్సెల్ కెమెరా , 7మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా , టచ్ ఐడి , బ్లూటూత్ 4.2 , ఎల్టీఈ సపోర్ట్ , వాటర్ మరియు డస్ట్ రెసిస్టాంట్ వంటి ఫీచర్లతో వస్తుంది.

Also Read:రియల్‌మి X7 మాక్స్ 5G, 4K స్మార్ట్ టీవీ లాంచ్ అయ్యాయి!! ఫీచర్స్ ఇవిగోAlso Read:రియల్‌మి X7 మాక్స్ 5G, 4K స్మార్ట్ టీవీ లాంచ్ అయ్యాయి!! ఫీచర్స్ ఇవిగో

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు

ఇక సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లు విషయానికి వస్తే వెనుకబడి ఉన్నాయి. ఉదాహరణకు, ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువగా శోధించిన స్మార్ట్‌ఫోన్‌లలో శామ్‌సంగ్ గెలాక్సీ S9 మరియు శామ్‌సంగ్ గెలాక్సీ  S9 ప్లస్ ఉన్నాయి. ఇవి కూడా కొంచెం పాతవి అయినప్పటికీ, వారి క్లాసిక్ డిజైన్ మరియు ఫీచర్ల కోసం వినియోగదారులలో ఇవి బాగా ప్రాచుర్యం పొందాయి.

Samsung Galaxy S9

Samsung Galaxy S9

గెలాక్సీ S9 ఫీచర్ల లో  5.8కర్వ్‌డ్‌ సూపర్‌ ఎమోలెడ్‌ డిస్‌ప్లే ఆండ్రాయిడ్‌ 8 ఓరియో 1440 x 2960 పిక్సెల్స్‌రిజల్యూషన్‌ 4జీబీర్యామ్‌ 64జీబీస్టోరేజ్‌ 12ఎంపీ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 mAhబ్యాటరీ ముఖ్యమైనవి.

Samsung Galaxy S9 plus

Samsung Galaxy S9 plus

గెలాక్సీ S9 ప్లస్‌ ఫీచర్ల విషయానికి వస్తే  6.2 డిస్‌ప్లే 1440x2960 రిజల్యూషన్‌ ఆండ్రాయిడ్‌ 8 ఓరియో 6జీబీ ర్యామ్‌ 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 64జీబీ స్టోరేజ్‌ 12 ఎంపీ డ్యుయల్‌ రియర్‌ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్‌ బ్యాటరీ తో వస్తుంది.

Also Read: Jio లో అతి చవకైన Rs .98 ప్లాన్ మళ్ళీ వచ్చింది! బెనిఫిట్స్ చూడండి.Also Read: Jio లో అతి చవకైన Rs .98 ప్లాన్ మళ్ళీ వచ్చింది! బెనిఫిట్స్ చూడండి.

ఈ జాబితాలో

ఈ జాబితాలో

ఈ జాబితాలో వివో, రియల్‌మే, రెడ్‌మి, మరియు ఒప్పో వంటి చైనీస్ బ్రాండ్ల నుండి కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు ఉన్నాయి. వాటిలో, ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువగా శోధించిన స్మార్ట్‌ఫోన్‌ లలో వివో బ్రాండ్ నుంచి  Vivo V15 ను కలిగి కలిగి ఉంది. ఇది మార్కెట్లో లభించే అత్యంత ప్రత్యేకమైన మరియు క్లాస్సి స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి.

Oppo F11 ప్రో

Oppo F11 ప్రో

మరొక చైనీస్ బ్రాండ్ అయిన ఒప్పో నుంచి Oppo F11 ప్రో ఈ లిస్ట్ లో చోటు సంపాదించింది,  అద్భుతమైన కెమెరా లక్షణాలు మరియు స్టైలిష్ డిజైన్‌తో చూడవచ్చు.ఒప్పో అంటేనే కెమెరా క్వాలిటీకి పేరుగాంచింది.ఈ ఒప్పో ఎఫ్11 ప్రొ ఫోన్ లో 48మెగా పిక్సెల్+5మెగా పిక్సెల్ డ్యూయల్ లెన్స్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ 48మెగా పిక్సెల్ సెన్సార్ AI అల్ట్రా-క్లియర్ ఇంజిన్ తో వస్తుంది.దీని వల్ల ఎలాంటి లైట్ కండిషన్స్ లో అయినా అదిరిపోయే ఫోటోలను తీసుకోవచ్చు.

ఇవి కాకుండా

ఇవి కాకుండా

ఇవి కాకుండా, Realme నుంచి  Realme 3, Realme 3 pro, మరియు Realme C2 కూడా ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువగా శోధించిన స్మార్ట్‌ఫోన్‌లలో ఉన్నాయి. ఈ రియల్‌మే స్మార్ట్‌ఫోన్‌లు సరసమైనవి మరియు అనేక సులభ లక్షణాలను ప్యాక్ చేస్తాయి, ఇవి జనాదరణ కూడా పొందాయి.

Xiaomi నుంచి

Xiaomi నుంచి

అదనంగా, ఇండియా లో బాగా పాపులర్ బ్రాండ్ మరియు సేల్స్ లో దూసుకుపోతున్న Xiaomi నుంచి రెడ్‌మి నోట్ 7 ప్రో కూడా విస్తృతంగా శోధించబడింది. ఇది ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్కువగా శోధించిన స్మార్ట్‌ఫోన్‌ల జాబితాలో చేరింది.

Best Mobiles in India

English summary
Most Searched Smartphones In Flipkart : Phones From Vivo,Oppo, Samsung And Apple List Is Here. 

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X