2016లో ఎక్కువగా సెర్చ్ చేసిన ఫోన్స్ ఇవే!

|

2016కు సంబంధించి గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను టీమ్ గిజ్‌‌బాట్ మీముందుకు తీసుకురావటం జరుగుతోంది. ఈ జాబితాలో వివాదాస్పద రింగింగ్ బెల్స్ ఫోన్ ఫ్రీడం 251 మొదటి స్థానంలో నిలిచింది. ఆ తరువాత స్థానంలో యాపిల్ ఐఫోన్ 7 ఉంది. ఈ జాబితాలో మిగిలిన స్థానాలను ఆక్రమించిన మిగిలిన స్మార్ట్‌ఫోన్లను ఇప్పుడు చూద్దాం...

Read More : ఇలా చేస్తే.. ఐదే ఐదు నిమిషాల్లో మీ ఫోన్ స్పీడ్ పెరుగుతుంది

ఫ్రీడం 251

ఫ్రీడం 251

ఈ ఏడాది ఆరంభంలో రింగింగ్ బెల్స్ కంపెనీ లాంచ్ వివాదాస్పద ఫోన్ ‘ఫ్రీడం 251' కోసం లక్షల మంది భారతీయులు గూగుల్ సెర్చ్‌లో శోధించారు. ఈ ఫోన్‌ను  కేవలం రూ.251కే ఇస్తామని కంపెనీ ప్రకటించటంతో లక్షల సంఖ్యలో యూజర్లు బుక్ చేసుకునేందుకు ప్రయత్నించారు. 

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

యాపిల్ ఐఫోన్ 7

యాపిల్ ఐఫోన్ 7

2016కుగాను ఇండియన్ యూజర్లు గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా శోధించిన ఫోన్‌ల జాబితాలో యాపిల్ ఐఫోన్ రెండవ స్దానంలో నిలిచింది. మార్కెట్లో గెలాక్సీ నోట్ 7 ఫెయిల్యుర్ నేపథ్యంలో ఐఫోన్ 7 అమ్మకాలు మరింతగా పెరిగిన విషయం తెలిసిందే.

షియోమీ రెడ్మీ నోట్ 3

షియోమీ రెడ్మీ నోట్ 3

2016కుగాను ఇండియన్ యూజర్లు గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా శోధించిన ఫోన్‌ల జాబితాలో షియోమీ రెడ్మీ నోట్ 3, మూడవ స్దానంలో నిలిచింది. కేవలం 7 నెలల వ్యవధిలో 23 లక్షల యూనిట్లను భారత్‌లో విక్రయించగలిగినట్లు షియోమీ ఇండియా తెలిపింది.

లెనోవో కే4 నోట్

లెనోవో కే4 నోట్

2016కుగాను ఇండియన్ యూజర్లు గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా శోధించిన ఫోన్‌ల జాబితాలో లెనోవో కే4 నోట్ , నాల్గవ స్దానంలో నిలిచింది. వివిడ్ డిస్‌ప్లే, ఇన్‌బిల్ట్ వీఆర్ టెక్నాలజీ, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ వంటి అంశాలు ఈ ఫోన్‌ను సంచలనంగా నిలబెట్టాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ జే7

సామ్‌సంగ్ గెలాక్సీ జే7

2016కుగాను ఇండియన్ యూజర్లు గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా శోధించిన ఫోన్‌ల జాబితాలో సామ్‌సంగ్ గెలాక్సీ జే7 ఐదవ స్దానంలో నిలిచింది. 4జీ కనెక్టువిటీ, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ లైఫ్, కాంపిటీటివ్ ప్రైస్ పాయింట్ వంటి అంశాలు ఫోన్ క్రేజ్‌ను పెంచాయి.

మోటరోలా మోటో జీ4

మోటరోలా మోటో జీ4

2016కుగాను ఇండియన్ యూజర్లు గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా శోధించిన ఫోన్‌ల జాబితాలో మోటరోలా మోటో జీ4, 6వ స్దానంలో నిలిచింది. మిడ్‌రేంజ్ స్మార్ట్‌‌ఫోన్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేయబడిన ఈ ఫోన్ అంతే పాపులారిటీని సంపాదించుకుంది.

వన్‌ప్లస్‌3

వన్‌ప్లస్‌3

2016కుగాను ఇండియన్ యూజర్లు గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా శోధించిన ఫోన్‌ల జాబితాలో మోటరోలా వన్‌ప్లస్‌3, 7వ స్దానంలో నిలిచింది. యాపిల్, సామ్‌సంగ్ తరహా హై-ఎండ్ స్పెసిఫికేషన్స్‌తో లాంచ్ అయిన ఈ ఫోన్ రూ.20,000 రేంజ్‌లో అందుబాటులో ఉండటం విశేషం.

యాపిల్ ఐఫోన్ ఎస్ఈ

యాపిల్ ఐఫోన్ ఎస్ఈ

2016కుగాను ఇండియన్ యూజర్లు గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా శోధించిన ఫోన్‌ల జాబితాలో iPhone SE 8వ స్దానంలో నిలిచింది. మిగిలిన ఐఫోన్‌లతో పోలిస్తే ఈ ఫోన్ బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌తో అందుబాటులో ఉండటమే ఇందుకు కారణం.

గూగుల్ పిక్సల్

గూగుల్ పిక్సల్

2016కుగాను ఇండియన్ యూజర్లు గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా శోధించిన ఫోన్‌ల జాబితాలో గూగుల్ పిక్సల్ ఫోన్‌‌లు 9వ స్దానంలో నిలిచాయి.

లెనోవో కే5 నోట్

లెనోవో కే5 నోట్

2016కుగాను ఇండియన్ యూజర్లు గూగుల్ సెర్చ్‌లో అత్యధికంగా శోధించిన ఫోన్‌ల జాబితాలో లెనోవో కే5 నోట్ 10వ స్దానంలో నిలిచింది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Best Mobiles in India

English summary
Most Searched Smartphones on Google India This Year. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X