Moto C Plus వచ్చేసింది, ధర రూ.6,999, రేపటి నుంచి సేల్
జియో ప్రైమ్ యూజర్లకు 30జీబి జియో 4జీ డేటా ఉచితం...
మోటరోలా నుంచి మరో ఎంట్రీలెవల్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. Moto C Plus పేరుతో విడుదలైన ఈ ఫోన్ ధర రూ.6,999. ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. సేల్ రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమవుతుంది. మొదటి సారి స్మార్ట్‌ఫోన్‌ను వాడుతున్న వారికి మోటో సీ ప్లస్ బెస్ట్ ఛాయిస్.

మోటో సీ ప్లస్ స్పెసిఫికేషన్స్...
5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్720× 1280పిక్సల్స్) విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్ ఆన్ టాప్, 1.3గిగాహెట్జ్ క్వాడ్ కోర్ ప్రాసెసర్‌తో కూడిన మీడియాటెక్ MT6737 సాక్, ర్యామ్ వేరియంట్స్ (1జీబి, 2జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

మోటో సీ ప్లస్ స్పెసిఫికేషన్స్...
8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (f/2.2 అపెర్చుర్, ,1.12 మైక్రాన్ పిక్సల్స్, ఆటో ఫోకస్, 71 డిగ్రీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.

కనెక్టువిటీ ఫీచర్లు...
4జీ ఎల్టీఈ విత్ VoLTE సపోర్ట్, 3జీ కనెక్టువిటీ, డ్యుయల్ సిమ్, వై-ఫై, జీపీఎస్, బ్లుటూత్, 3.5ఎమ్ఎమ్ హెడ్‌ఫోన్ జాక్, ఎఫ్ఎమ్ రేడియో, ఫోన్ చుట్టుకొలత 144x72.3x10మిల్లీ మీటర్లు, బరువు 162 గ్రాములు.

లాంచ్ ఆఫర్స్ ఇవే..
లాంచ్ ఆఫర్స్ క్రింద మోటో సీ ప్లస్ కొనుగోలు పై అనేక ఆసక్తికర ఆఫర్లను ఫ్లిప్‌కార్ట్ లాంచ్ చేసింది. లాంచ్ డే రోజున మోటో సీ ప్లస్ కొనుగోలు చేసిన వారికి ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ కొనుగోలు పై 30% డిస్కౌంట్‌తో పాటు మోటరోలా పల్స్ హెడ్‌సెట్ రూ.749కే లభిస్తుంది. అంతేకాకుండా జియో ప్రైమ్ యూజర్లకు 30జీబి జియో 4జీ డేటా ఉచితంగా లభిస్తుంది.


Click it and Unblock the Notifications