4,000mAh బ్యాటరీతో మోటరోలా ఫోన్, రూ.8000కే?

ఇప్పటికే మార్కెట్లో లాంచ్ అయిన రెడ్మీ 4, నోకియా 3 ఫోన్‌లకు మోటో సీ4 ప్లస్ ప్రధాన కాంపిటీటర్‌...

|

మోటరోలా నుంచి మరో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్ కాబోతోంది. మోటో సీ ప్లస్ (Moto C Plus) పేరుతో రాబోతోన్న ఈ ఫోన్‌ను జూన్ 19న మార్కెట్లో విడుదల చేస్తారు. 4,000mAh బ్యాటరీతో వస్తోన్న ఈ ఫోన్ ధర రూ.8,000లోపు ఉండొచ్చని తెలుస్తోంది. మోటో సీ ప్లస్‌కు ముందు వర్షన్ అయిన మోటో సీ స్మార్ట్‌ఫోన్‌ను కొద్ది రోజుల క్రితమే ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయటం జరిగింది. ఈ ఫోన్ ధర రూ.5,999గా ఉంది.

మోటో సీ ప్లస్

Moto C Plus స్పెసిఫికేషన్స్... 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్-కోర్ మీడియాటెక్ MT6737 ప్రాసెసర్ మాలీ టీ720 జీపీయూ, ర్యామ్ వేరియంట్స్ (1జీబి, 2జీబి), 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 16జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

మోటో సీ ప్లస్

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, వై-ఫై, బ్లుటూత్, జీపీఎస్, మైక్రో యూఎస్బీ పోర్ట్, ఫోన్ చుట్టుకొలత 144x 72.3x 10 మిల్లీ మీటర్లు, బరువు 162 గ్రాములు. ఇప్పటికే మార్కెట్లో లాంచ్ అయిన రెడ్మీ 4, నోకియా 3 ఫోన్‌లకు మోటో సీ4 ప్లస్ ప్రధాన కాంపిటీటర్‌గా నిలిచే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Moto C Plus set to launch in India on June 19. Read More in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X