మోటో ఇ మరోసారి ‘అవుట్ ఆఫ్ స్టాక్’

|

సగటు స్మార్ట్‌ఫోన్ వినియోగదారుడి కలలను సాకారం చేస్తూ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాల సృష్టిస్తున్న స్మార్ట్‌ఫోన్ మోటరోలా ‘మోటో ఇ'. అత్యాధునిక ఆండ్రాయిడ్ స్మార్ట్ మొబైలింగ్ స్పెసిఫికేషన్‌లతో బడ్జెట్ ప్రెండ్లీ ధర వేరియంట్‌లో లభ్యమవుతున్న ఈ ఫోన్‌ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకంగా విక్రయిస్తోంది. మే 13న ఇండియన్ మార్కెట్లో విడుదలైన నాటి నుంచి మోటో ఇ స్మార్ట్‌ఫోన్‌‍లను కొనుగోలు చేసేందుకు జనం ఎగబడుతున్నారు. స్టాక్ యూనిట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోవటంతో ఫ్లిప్‌కార్ట్ పలుమార్లు ‘అవుట్ ఆఫ్ స్టాక్' బోర్డులను తన వెబ్‌సైట్‌లో పెట్టవల్సి వస్తోంది. తాజాగా మరోమారు ఇదే పరిస్థితి నెలకుంది. ‘మోటో ఇ'ని ప్రీఆర్డర్ చేసుకున్న వారికి జూన్ 3 తరువాత డెలివరీ ఇవ్వగలమని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది.

 
 మోటో ఇ మరోసారి ‘అవుట్ ఆఫ్ స్టాక్’

ఇండియన్ మార్కెట్లో మోటో ఇ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ ఇంకా వైట్‌ కలర్ వేరియంట్‌లో లభ్యమవుతోంది. ధర రూ.6,999. మోటరోలా మోటో ఇ, 4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ తాకేతెరను కలిగి ఉంటుంది.రిసల్యూషన్ సామర్ధ్యం 540x 960పిక్సల్స్, 256 పీపీఐ పిక్సల్ డెన్సిటీ.కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్ర్కీన్‌ను మోటరోలా ఈ డివైస్‌ను వినియోగించింది. పొందుపరిచిన ‘వాటర్ నానో కోటింగ్ 'నీటి ప్రమాదాల నుంచి డివైస్‌ను రక్షిస్తుంది. 1.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ డివైస్ గ్రాఫిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.పొందుపరిచిన 1జీబి ర్యామ్ సౌకర్యవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహదపడుతుంది. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది. ఫోన్ వెనుక భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఫ్రంట్ కెమెరా లేదు. 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు పెంచుకునే అవకాశాన్ని మోటరోలా కల్పిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X