Home
Mobile

మోటో ఇ ‘అవుట్ ఆఫ్ స్టాక్’

మోటరోలా నుంచి మంగళవారం ఆవిష్కరించబడిన మధ్య ముగింపు ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ స్మార్ట్‌ఫోన్ ‘మోటో ఇ' విడుదలైన కొద్ది సమయంలోనే స్టాక్ నిండుకున్నట్లు సమాచారం. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ డివైస్‌ను మే 14 నుంచి ప్రత్యేకంగా విక్రయిస్తోంది. అయితే, విడుదలైన కొద్ది సమయంలోనే స్టాక్ పూర్తిగా అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో ఫ్లిప్‌కార్ట్ ‘మోటో ఇ' స్మార్ట్‌ఫోన్‌లను ప్రీబుకింగ్ పై విక్రయిస్తోంది. డివైస్‌ను బుక్ చేసుకున్న 7 నుంచి 10 రోజుల్లో డెలివరీ ఉంటుందని సదరు రిటైలర్ వినియోగదారులకు హామి ఇస్తోంది.

 మోటో ఇ  ‘అవుట్ ఆఫ్ స్టాక్’

ఇండియన్ మార్కెట్లో మోటో ఇ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ ఇంకా వైట్‌ కలర్ వేరియంట్‌లో లభ్యమవుతోంది. ధర రూ.6,999. మోటరోలా మోటో ఇ, 4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ తాకేతెరను కలిగి ఉంటుంది.రిసల్యూషన్ సామర్ధ్యం 540x 960పిక్సల్స్, 256 పీపీఐ పిక్సల్ డెన్సిటీ.కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్ర్కీన్‌ను మోటరోలా ఈ డివైస్‌ను వినియోగించింది. పొందుపరిచిన ‘వాటర్ నానో కోటింగ్ 'నీటి ప్రమాదాల నుంచి డివైస్‌ను రక్షిస్తుంది.

1.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ డివైస్ గ్రాఫిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.పొందుపరిచిన 1జీబి ర్యామ్ సౌకర్యవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహదపడుతుంది. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.ఫోన్ వెనుక భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఫ్రంట్ కెమెరా లేదు. 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు పెంచుకునే అవకాశాన్ని మోటరోలా కల్పిస్తోంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Best Mobiles in India

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X