ఒక్క పూటలో లక్ష ఫోన్‌లు అమ్మేసారు!
తన తాజా స్మార్ట్‌ఫోన్ ‘మోటో ఇ'ఇండియన్ మార్కెట్లో క్లిక్ అవటంతో మోటరోలా మొబిలిటీ ఖుషి ఖుషిగా ఉంది. ఈ మధ్యముగింపు ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకంగా విక్రయిస్తున్న విషయం తెలిసిందే. దేశీయ మార్కెట్లో ‘మోటో ఇ' విక్రయాలు మే 13 అర్థరాత్రి (తెల్లవారితే మే, 14) నుంచి ప్రారంభమయ్యాయి. అయితే, అమ్మకాలు ప్రారంభమైన కొద్ది సేపటికే స్టాక్ మొత్తం అయిపోయినట్లు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించేసింది. విశ్వసనీయ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం మేరకు ఫ్టిప్‌కార్ట్ ఒక్క రోజులో 80 నుంచి లక్ష మిలియన్ మోటో ఇ స్మార్ట్‌ఫోన్ యూనిట్లను విక్రయించినట్లు సమాచారం.

మోటో ఇ స్మార్ట్‌ఫోన్‌లకు డిమాండ్ మరింతగా ఆదరణ పెరిగిన నేపధ్యంలో ఫ్లిప్‌కార్ట్ సదరు ఫోన్‌లను ప్రీబుకింగ్ పై విక్రయిస్తోంది. డివైస్‌ను బుక్ చేసుకున్న 7 నుంచి 10 రోజుల్లో డెలివరీ ఉంటుందని వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్ హామి ఇస్తోంది. ఇండియన్ మార్కెట్లో మోటో ఇ స్మార్ట్‌ఫోన్ బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లో లభ్యమవుతోంది. ధర రూ.6,999.
మోటరోలా మోటో ఇ, 4.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ తాకేతెరను కలిగి ఉంటుంది.రిసల్యూషన్ సామర్ధ్యం 540x 960పిక్సల్స్, 256 పీపీఐ పిక్సల్ డెన్సిటీ.కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 స్ర్కీన్‌ను మోటరోలా ఈ డివైస్‌ను వినియోగించింది. పొందుపరిచిన ‘వాటర్ నానో కోటింగ్ 'నీటి ప్రమాదాల నుంచి డివైస్‌ను రక్షిస్తుంది. 1.2గిగాహెట్జ్ క్లాక్ వేగంతో కూడిన డ్యూయల్ కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 200 ప్రాసెసర్‌ను ఫోన్‌లో నిక్షిప్తం చేసారు. అడ్రినో 302 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్ డివైస్ గ్రాఫిక్ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తుంది.పొందుపరిచిన 1జీబి ర్యామ్ సౌకర్యవంతమైన మల్టీ టాస్కింగ్‌కు దోహదపడుతుంది. ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై ఫోన్ రన్ అవుతుంది.ఫోన్ వెనుక భాగంలో 5 మెగా పిక్సల్ కెమెరా వ్యవస్థను ఏర్పాటు చేసారు. ఫ్రంట్ కెమెరా లేదు. 4జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు పెంచుకునే అవకాశాన్ని మోటరోలా కల్పిస్తోంది.
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications








