తెర పైకి Moto E3 Power.. సెప్టంబర్ 19న భారత్‌లో లాంచ్

మోటరోలా నుంచి మరో బడ్జెట్ ఫ్రెండ్లీ బ్లాక్‌బస్టర్ ఫోన్ మార్కెట్లోకి రాబోతోంది. లెనోవో నేతృత్వంలోని మోటరోలా తన Moto E సిరీస్ నుంచి సరికొత్త స్మార్ట్‌ఫోన్‌‍ను భారత్ మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది.

తెర పైకి Moto E3 Power.. సెప్టంబర్ 19న భారత్‌లో లాంచ్

Read More : రిలయన్స్ జియో 4జీ, నచ్చేవేంటి..? నచ్చనివేంటి..?

Moto E3 Power పేరుతో సెప్టంబర్ 19న విడుదల కాబోతోన్న ఈ ఫోన్‌ను ప్రముఖ ఈ-కామర్స్ వెబ్‌సైట్ Flipkart ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించబోతోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

#1

మోటో ఇండియా ఇప్పటికే ఈ వివరాలను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ధృవీకరించింది. మరోవైపు ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌కు సంబంధించి ప్రత్యేక పేజీని ఇప్పటికే లాంచ్ చేసింది.

#2

మార్కెట్లో ఈ ఫోన్ ధర ఎంత ఉంటుందనే దాని పై ఎటువంటి సమచారం ఇప్పటి వరకు అందుబాటులో లేదు. హాంకాంగ్ మార్కెట్లో ఈ ఫోన్ ధర HKD 1,098గా ఉంది మన కరెన్సీలో రూ.9,500.

#3

Moto E3 Power స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే, 1గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ఎంటీ6753పీ ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ
కార్డ్‌స్లాట్ ద్వారా డివైస్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

#4

8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ ఎల్ఈడి ఫ్లాష్ అండ్ ఆటో ఫోకస్, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం, డ్యుయల్ సిమ్ స్లాట్స్ (మైక్రో), 3500 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, జీపీఎస్, బ్లుటూత్, వై-ఫై).

#5

మోటరోలాకు ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో పునర్జీవం పోసిన మోటో ఇ, మోటో జీ ఫోన్‌లు మనందరికి తెలుసు. డజన్ల కొద్ది కొత్త స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లోకి దిగుతున్నప్పటికి మోటో సిరీస్ ఫోన్‌లకు మాత్రం ఆదరణ చెక్కు చెదరటం లేదు. మార్కెట్ డిమాండ్ ను దృష్టిలో ఉంచుకుని మోటరోలా ప్రతి ఏటా మోటో జీ, ఇ సిరీస్‌ల నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువస్తోంది.

#6

Moto E3 (2016) వర్షన్, కొద్ది గంటల క్రితమే అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ అయ్యింది. Moto E3 Power పేరుతో ఈ ఫోన్‌ను భారత్‌లో విక్రయించబోతున్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto E3 Power India Launch Set for September 19. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot