రెడ్మీ నోట్ 4కు చెక్, 5000 mAh బ్యాటరీతో Moto E4...

5000 mAh బ్యాటరీ ఈ ఫోన్‌కు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందట.

|

మోటో ఇ4, ఇ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు కమర్షియల్ లాంచ్‌కు సిద్ధమవుతోన్న నేపథ్యంలో, ఈ రెండు డివైస్‌లకు సంబంధించి మరిన్ని ఫోటోలతో పాటు ఆసక్తికర రూమర్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

Read More : ఫేస్‌బుక్ అకౌంట్‌ను పూర్తిగా డిలీట్ చేయటం ఎలా..?

Moto E4  స్పెసిఫికేషన్స్...

Moto E4 స్పెసిఫికేషన్స్...

లేటెస్ట్ రూమర్స్ ప్రకారం మోటో ఇ4 మీడియాటెక్ MT6737M సాక్ పై రన్ అవుతుంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌‌లో 2జీబి ర్యామ్‌తో పాటు 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసారు. మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని కూడా విస్తరించుకోవచ్చు.

Moto E4  స్పెసిఫికేషన్స్...

Moto E4 స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

రూ.339కే రోజుకు 3జీబి డేటా నెలంతా కాల్స్రూ.339కే రోజుకు 3జీబి డేటా నెలంతా కాల్స్

Moto E4 Plus స్పెసిఫికేషన్స్..?
 

Moto E4 Plus స్పెసిఫికేషన్స్..?

లేటెస్ట్ రూమర్స్ ప్రకారం మోటో ఇ4 ప్లస్ కూడా మీడియాటెక్ MT6737M సాక్ పైనే రన్ అవుతుంది. 5000 mAh బ్యాటరీ, ఈ ఫోన్‌కు పెద్ద ప్లస్ పాయింట్ అవుతుందట.

4జీబి ర్యామ్ వేరియంట్‌లో కూడా..

4జీబి ర్యామ్ వేరియంట్‌లో కూడా..

ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం,13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ర్యామ్ విషయానికి వచ్చేసరికి ఇ4 ప్లస్ 2జీబి, 3జీబి అలానే 4జీబి ర్యామ్ వేరియంట్‌లలో కూడా అందుబాటులో ఉంటుందట. ఇంటర్నల్ స్టోరేజ్ కెపాసిటీ మాత్రం 16జీబి వరుకే ఉంటుందట.

అమెరికా అత్యంత రహస్యంగా వాడిన టెక్నాలజీ ఇదే...అమెరికా అత్యంత రహస్యంగా వాడిన టెక్నాలజీ ఇదే...

మల్టీ కోర్ టెస్ట్‌లో 1514 పాయింట్లు..

మల్టీ కోర్ టెస్ట్‌లో 1514 పాయింట్లు..

వారం రోజుల క్రితం మోటో ఇ4 స్మార్ట్‌ఫోన్ ప్రముఖ బెంచ్ మార్కింగ్ వెబ్‌సైట్‌లలో ఒకటైన ‌Geekbenchలో హల్‌చల్ చేసింది. ఈ సైట్ నిర్వహించిన సింగిల్ కోర్ట్ టెస్ట్‌లో 551 పాయింట్లు, మల్టీ కోర్ టెస్ట్‌లో 1514 పాయింట్లను ఈ ఫోన్ సాధించగలిగింది.

ట్విట్టర్ ద్వారా ఫోటోలు లీక్..

ట్విట్టర్ ద్వారా ఫోటోలు లీక్..

మోటో ఇ4 అలానే ఇ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించి ఫోటోలు @evleaks అనే ట్విట్టర్ అకౌంట్ ద్వారా కొద్ది రోజుల క్రితం మార్కెట్లో లీక్ అయ్యాయి.

మే 5 నుంచి నోకియా ఫోన్ బుకింగ్స్మే 5 నుంచి నోకియా ఫోన్ బుకింగ్స్

FCC క్లియరెన్స్ కూడా వచ్చేసింది..

FCC క్లియరెన్స్ కూడా వచ్చేసింది..

XT1723 మోడల్ నెంబర్‌తో రాబోతోన్న మోటో ఇ4 స్మార్ట్‌ఫోన్‌కు గత నెలలోనే ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమీషన్ (FCC) నుంచి క్లియరెన్స్ సర్టిఫికేషన్ లభించినట్లు సమాచారం.

Best Mobiles in India

English summary
Moto E4 and E4 Plus specifications and prices leak ahead of launch. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X