5000mAh బ్యాటరీతో Moto E4 Plus లాంచ్ అయ్యింది
లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ పై రన్ అయ్యే ఈ రెండు ఫోన్‌లు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫ్రంట్ ఫ్లాష్‌ను సపోర్ట్ చేస్తాయి.
భారీ అంచనాల మధ్య మోటరోలా తన మోటో ఇ4, మోటో ఇ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లను అంతర్జాతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. గతేడాది మార్కెట్లో లాంచ్ అయిన మోటో ఇ3, మోటో ఇ3 పవర్ స్మార్ట్‌ఫోన్‌లకు ఈ న్యూ వర్షన్ ఫోన్‌లు అప్‌డేటెడ్ వర్షన్స్.

జూన్ 22 నుంచి మార్కెట్లో...
లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ పై రన్ అయ్యే ఈ రెండు ఫోన్‌లు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫ్రంట్ ఫ్లాష్ సపోర్ట్ చేస్తాయి. యూఎస్ సహా ఇతర ప్రముఖ మార్కెట్లో జూన్ 22 నుంచి ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి.

మోటో ఇ4 స్పెసిఫికేషన్స్...
5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 427 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, సింగిల్ సిమ్ స్లాట్ (నానో), 2800mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, కనెక్టువిటీ ఫీచర్స్ (4జీ వోల్ట్, బ్లుటూత్ 4.1ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్).

మోటో ఇ4 ప్లస్ స్పెసిఫికేషన్స్...
5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 427 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, సింగిల్ సిమ్ స్లాట్ (నానో), 50000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, కనెక్టువిటీ ఫీచర్స్ (4జీ వోల్ట్, బ్లుటూత్ 4.1ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్).

ధరలు
యూఎస్ మార్కెట్లో మోటో ఇ4 గోల్డ్ ఇంకా Licorice బ్లాక్ కలర్ వేరియంట్ లలో దొరుకుతుంది. ధర 129.99 డాలర్లు ( మన కరెన్సీలో రూ.8,400). మోటో ఇ4 ప్లస్ ఐరన్ గ్రే, ఆక్స్ ఫర్డ్ బ్లు ఇంకా బ్లష్ గోల్డ్ కలర్ వేరియంట్‌లలో దొరుకుతుంది. ధర 179.99 డాలర్లు (మన కరెన్సీలో రూ.11,600). ఇండియన్ మార్కెట్లో ఈ ఫోన్‌లు అందుబాటుకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం వెలువడాల్సి ఉంది.


Click it and Unblock the Notifications








