5000mAh బ్యాటరీతో మోటరోలా బడ్జెట్ ఫోన్
ఫోన్ ధర రూ.10,000 నుంచి రూ.15,000 మధ్య ఉండొచ్చని అంచనా.
మోటరోలా మోటో ఇ సిరీస్ నుంచి మరో శక్తివకంతమైన స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో లాంచ్ కాబోతోన్నట్లు సమచారం. Moto E4 Plus పేరుతో రాబోతోన్న ఈ డివైజ్ గురించి ఆసక్తికర రూమర్స్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి.

5000mAh బ్యాటరీ కెపాసిటీతో
డిజైనింగ్ పరంగా మోటో జీ, మోటో జెడ్ ఫోన్‌లను దగ్గర పోలికలను కలిగి ఉన్న ఈ ఫోన్ ఏకంగా 5000mAh బ్యాటరీ కెపాసిటీతో రాబోతోందట.

మోటో ఇ4 ప్లస్ రూమర్ స్పెసిఫికేషన్స్..
5.5 అంగుళాల డిస్‌ప్లే, మీడియాటెక్ ఎంటీ6737 క్వాడ్-కోర్ ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 5000mAh బ్యాటరీ కెపాసిటీ. జూన్ మొదటి వారంలో ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

ధర ఎంత ఉంటుంది..?
ఇండియన్ మార్కెట్లో మోటో జీ4 ప్లస్ ధర రూ.10,000 నుంచి రూ.15,000 మధ్య ఉండొచ్చని మార్కెట్లో అంచనా వేస్తున్నాయి.

మోటో జీఎస్, మోటో జీఎస్+
మోటో జీ5, మోటో జీ5 ప్లస్ మోడల్స్‌కు సక్సెసర్ వర్షన్‌గా రావల్సి ఉన్న ఫోన్‌లను మోటో జీఎస్ ( Moto gS ), మోటో జీఎస్+ (Moto gS+) వేరియంట్‌లలో మోటరోలా లాంచ్ చేయబోతోన్నట్లు లీకైన్ రోడ్ మ్యాప్ ద్వారా తెలుస్తోంది. Moto gS వర్షన్ మెటల్ బాడీతో పాటు 5.2 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరో వేరియంట్ మోటో జీఎస్+ 5.5 అంగుళాల అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లేతో పాటు డ్యుయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంటుంది.


Click it and Unblock the Notifications








