మోటో ఇ4 ప్లస్, నోకియా 3, రెడ్‌మి4, లెనోవో కే6 పవర్.. వీటిలో బెస్ట్ ఫోన్ ఏది?

శక్తివంతమైన 5000mAh బ్యాటరీ‌తో మోటో ఇ4 ప్లస్ రేపు మార్కెట్లో లాంచ్ కాబోతోంది. ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌కు నోకియా 3, షియోమీ రెడ్‌మి 4, లెనోవో కే6 పవర్ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి తీవ్రమైన పోటీ ఎదురయ్యే అవకాశం కనిపిస్తోంది. రూ.10,000 ధర బ్రాకెట్లో దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోన్న ఈ నాలుగు ఫోన్‌లకు సంబంధించి Spec Comparisonను ఇప్పుడు చూద్దాం...

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ముందుగా ధరలు...

జూలై 12న మార్కెట్లో లాంచ్ కాబోతోన్న మోటో ఇ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధర రూ.9,000 నుంచి రూ.12,000 మధ్య ఉండొచ్చని తెలుస్తోంది. ఇదే సమయంలో నోకియా 3 ధర ఆఫ్‌లైన్ మార్కెట్లో రూ.9,499గా ఉంది. లెనోవో కే6 పవర్ 3జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.9,999గాను, 4జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.10,999గా ఉంది. రెడ్‌మి 4 ఫోన్ 2జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.6,999గాను, 3జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.8,999గాను, 4జీబి ర్యామ్ వేరియంట్ ధర రూ.10,999గాను ఉంది.

మోటో ఇ4 ప్లస్ స్పెసిఫికేషన్స్...

ఫీచర్స్ ఇంకా స్పెసిఫికేషన్స్ పరంగా మోటో ఇ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌కు ప్రధాన హైలైట్ 5000mAh బ్యాటరీ. ఈ బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తోంది. వాటర్ రిపల్లెంట్ కోటింగ్‌తో వస్తోన్న మోటో ఇ4 ప్లస్ చిన్నచిన్న నీటి ప్రమాదాలను సమర్థవంతంగా తట్టుకోగలదు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. ఇతర స్పెసిఫికేషన్స్‌ను పరిశీలించినట్లయితే... 5.5 అంగుళాల హైడెఫినిషన్ స్ర్కీన్, 1.3గిగాహెట్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ MT6737M చిప్ సెట్, ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్.

నోకియా 3 స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్‌‌కోర్ మీడియాటెక్ MTK6737 చిప్‌సెట్ విత్ క్వాడ్-కోర్ 1.3Ghz ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్న్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసిగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, NFC సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 2650 mAh బ్యాటరీ. అందుబాటులో ఉండే రంగులు (సిల్వర్ వైట్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).

లెనోవో కే6 పవర్ స్పెసిఫికేషన్స్..

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1920 x 1080పిక్సల్స్), ఆండ్రాయిడ్ మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రూపొందించిన లెనోవో ప్యూర్ యూజర్ ఇంటర్‌ఫేస్, 1.4GHz ఆక్టా‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్, అడ్రినో 505 గ్రాఫిక్స్ యూనిట్, ఫింగర్ - ప్రింట్ సెన్సార్, 3జీబి ర్యామ్, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా విత్ సోనీ IMX258 సెన్సార్, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విత్ వైడ్ యాంగిల్ లెన్స్, 4000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టం. 4జీ వోల్ట్ సపోర్ట్.

రెడ్‌మి 4 స్పెసిఫికేషన్స్..

5 ఇంచ్ హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే విత్ 2.5డి కర్వుడ్ గ్లాస్, ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం విత్ MIUI 8, ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్. ర్యామ్ వేరియంట్స్ (2జీబి, 3జీబి, 4జీబి), స్టోరేజ్ వేరియంట్స్ (16జీబి, 32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం. కెమెరా 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ వోల్ట్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్, డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ, 4100mAh బ్యాటరీ. రెడ్‌మి 4 ఫోన్‌లను అమెజాన్ ఇండియా అలానే Mi.comలు ఎక్స్‌క్లూజివ్‌గా
విక్రయిస్తున్నాయి.

ఈ ఫోన్‌లు ఎక్కడెక్కడ దొరుకుతున్నాయ్..?

మోటో ఇ4 ప్లస్ అందుబాటుకు సంబంధించిన వివరాలు మరికొద్ది రోజుల్లో వెల్లడవుతాయి. నోకియా 3 ఫోన్‌లను ఆఫ్‌లైన్ మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు. లెనోవో కే6 పవర్ స్మార్ట్‌ఫోన్‌లను ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto E4 Plus vs Nokia 3 vs Xiaomi Redmi 4 vs Lenovo K6 Power. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot