మోటో ఇ4 ప్లస్ విడుదలకు సిద్దమవుతోంది..

మోటో సీ ప్లస్ లాంచ్ తరువాత ఏ మాత్రం గ్యాప్ తీసుకోకుండా, మోటరోలా మరో స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ కొత్త ఫోన్‌కు సంబంధించిన టీజర్ పార్ట్‌ను మోటో ఇండియా అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా మోటరోలా పోస్ట్ చేసింది.

మోటో ఇ4 ప్లస్ విడుదలకు సిద్దమవుతోంది..

ఈ టీజర్‌ను బట్టి చూస్తుంటే మోటరోలా అప్‌కమ్మింగ్ ఫోన్ బలమైన బ్యాటరీ లైఫ్‌తో రాబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఈ ఫోన్ మోడల్‌కు సంబంధించి ఏ విధమైన సమాచారాన్ని మోటరోలా రివీల్ చేయనప్పటికి కంపెనీ లాంచ్ చేయబోతోన్నది మాత్రం మోటో ఇ4 ప్లస్సేనని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మోటో ఇ4 ప్లస్ విడుదలకు సిద్దమవుతోంది..

మోటో ఇ4 ప్లస్ స్పెసిఫికేషన్స్... 5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 427 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, సింగిల్ సిమ్ స్లాట్ (నానో), 50000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, కనెక్టువిటీ ఫీచర్స్ (4జీ వోల్ట్, బ్లుటూత్ 4.1ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్).English summary
Moto E4 Plus with 5000mAh battery to be launched in India. Read More in Telugu Gizbot..
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting