రూ.9,999కే మోటో ఇ4 ప్లస్ : 3జీబి ర్యామ్, 5000mAh బ్యాటరీ

మోటో ఇ4 ప్లస్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. బుధవారం న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఈవెంట్‌లో భాగంగా మోటరోలా ఈ ఫోన్‌ను విడుదల చేసింది. ధర రూ.9,999. ఫిప్‌కార్ట్ ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. 5000mAh బ్యాటరీ ఈ ఫోన్‌కు ప్రధాన హైలెట్.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

వాటర్ రిపెల్లెంట్ నానో కోటింగ్‌..

మెటల్ బాడీతో వస్తోన్న ఈ ఫోన్ రేర్ కెమెరా భాగం సర్క్యులర్ ఫ్రేమ్‌ను కలిగి ఉంటుంది. మోటరోలా బ్యాట్‌వింగ్ లోగా అలానే స్పీకర్ గ్రిల్ ఫోన్ వెనుక భాగంలో ఉన్నాయి. ఫోన్ హోమ్‌బటన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను నిక్షిప్తం చేసారు. వాటర్ రిపెల్లెంట్ నానో కోటింగ్‌తో వస్తోన్న ఈ ఫోన్ చిన్నచిన్న నీటి ప్రమాదాలను తట్టుకోగలదు.

3జీబి ర్యామ్/32జీబి స్టోరేజ్ వేరియంట్‌లో..

ఇండియన్ మార్కెట్లో మోటో ఇ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్ 3జీబి ర్యామ్/32జీబి స్టోరేజ్ వేరియంట్‌లో దొరుకుతుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ రోజు రాత్రి 11.59 నిమిషాల నుంచి సేల్ ప్రారంభమవుతుంది. లాంచ్ డే రోజున ఈ ఫోన్‌ను కొనుగోలు చేసే యూజర్లకు రూ.1599 ఖరీదు చేసే మోటో పల్స్ 2 హెడ్ ఫోన్ రూ.749కే లభిస్తుంది.

ఐడియా, జియో ఆఫర్లు...

అంతేకాకుండా రెండు నెలల హాట్ స్టార్ ప్రీమియమ్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఐడియా యూజర్లకు 84జీబి డేటా రూ.443కే లభిస్తుంది. జియో యూజర్లకు జియో ప్రైమ్ + 30జీబి అదనపు డేటాను ఫ్లిప్‌కార్ట్ అందిస్తోంది. లాంచ్ డే ఆఫర్ క్రింద ఈ ఫోన్ పై రూ.9,000 వరకు ఎక్స్‌ఛేంజ్ వాల్యూను ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తోంది. బుయ్‌బ్యాక్ గ్యారంటీ క్రింద రూ.4,000 వరకు లభిస్తుంది.

మోటో ఇ4 ప్లస్ స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రారయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.3గిగాహెట్జ్ క్వాడ్-కోర్ మీడియాటెక్ MTK6737M సాక్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

కెమెరా, బ్యాటరీ, కనెక్టువిటీ ఫీచర్స్...

13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (f/2.0 aperture, ఆటో ఫోకస్, సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్ సపోర్ట్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా (f/2.2 aperture, ఫిక్సుడ్ ఫోకస్, సింగిల్ ఎల్ఈడి ఫ్లాష్, బ్యూటిఫికేషన్ మోడ్), 5000mAh నాన్ రిమూవబుల్ బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, ఫింగర్ ప్రింట్ స్కానర్, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ VoLTE, వై-ఫై, బ్లుటూత్, మైక్రో యూఎస్బీ పోర్ట్, జీపీఎస్, బ్లుటూత్ వీ4.1), సెన్సార్స్ (యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, మ్యాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటి సెన్సార్), ఫోన్ బరువు 181 గ్రాములు, చుట్టుకొలత 155x77.5x9.55మిల్లీ మీటర్లు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Moto E4 Plus With 5000mAh Battery Launched in India. Read More in Teluu Gizbot..
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot