Home
Mobile

Moto E4 ఇండియాలో లాంచ్ అయ్యింది

త్వరలోనే మోటో ఇ4 ప్లస్‌ కూడా...

By Sivanjaneyulu Bommu

మోటరోలా నుంచి మరో బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయ్యింది. మోటో ఇ4 పేరుతో ఈ ఫోన్ విడుదలైనట్లు సమాచారం. ప్రముఖ రిటైలర్ Mahesh Telecom వెల్లడించిన వివరాల ప్రకారం మోటో ఇ4 స్మార్ట్‌ఫోన్ రిటైల్ స్టోర్‌లలో రూ.8,999 ధర ట్యాగ్ తో అందుబాటులో ఉంటుంది. ఇదే సమయంలో మోటో ఇ4 ప్లస్ కూడా మరికొద్ది రోజుల్లో లాంచ్ కాబోతోంది.

మోటో ఇ3, మోటో ఇ3 పవర్‌లకు అప్‌డేటెడ్ వర్షన్స్...

మోటో ఇ3, మోటో ఇ3 పవర్‌లకు అప్‌డేటెడ్ వర్షన్స్...

యూఎస్ సహా ఇతర ప్రముఖ మార్కెట్లలో మోటో ఇ4, మోటో ఇ4 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లు ఇప్పటికే లభ్యమవుతున్నాయి. గతేడాది మార్కెట్లో లాంచ్ అయిన మోటో ఇ3, మోటో ఇ3 పవర్ స్మార్ట్‌ఫోన్‌లకు ఈ న్యూ వర్షన్ ఫోన్‌లు అప్‌డేటెడ్ వర్షన్స్.

 ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫ్రంట్ ఫ్లాష్ సపోర్ట్‌‌

ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫ్రంట్ ఫ్లాష్ సపోర్ట్‌‌

లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ పై రన్ అయ్యే ఈ రెండు ఫోన్‌లు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో పాటు ఫ్రంట్ ఫ్లాష్ సపోర్ట్‌‌ చేస్తాయి.

 మోటో ఇ4 స్పెసిఫికేషన్స్...

మోటో ఇ4 స్పెసిఫికేషన్స్...

5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, MediaTek MTK6737M chipset, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, సింగిల్ సిమ్ స్లాట్ (నానో), 2800mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, కనెక్టువిటీ ఫీచర్స్ (4జీ వోల్ట్, బ్లుటూత్ 4.1ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్).

మోటో ఇ4 ప్లస్ స్పెసిఫికేషన్స్...

మోటో ఇ4 ప్లస్ స్పెసిఫికేషన్స్...

5.5 అంగుళాల ఫుల్ హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 7.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం, 1.4గిగాహెట్జ్ స్నాప్‌డ్రాగన్ 427 ప్రాసెసర్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, సింగిల్ సిమ్ స్లాట్ (నానో), 50000mAh బ్యాటరీ విత్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, కనెక్టువిటీ ఫీచర్స్ (4జీ వోల్ట్, బ్లుటూత్ 4.1ఎల్ఈ, ఎన్ఎఫ్‌సీ సపోర్ట్).

Best Mobiles in India

English summary
Moto E4 With Android 7.1 Nougat Reportedly Launched in India: Price, Specifications. Read More in Telugu Gizbot..
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X