ఇండియాలో లాంచ్ అయిన Moto E5, E5 Plus, పూర్తి వివరాలు !
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా కొత్తగా మరో రెండు స్మార్ట్‌ఫోన్ల అయిన Moto E5, Moto E5 plus ను మార్కెట్ లోకి విడుదల చేసింది.
స్మార్ట్‌ఫోన్ దిగ్గజం మోటోరోలా కొత్తగా మరో రెండు స్మార్ట్‌ఫోన్ల అయిన Moto E5, Moto E5 plus ను మార్కెట్ లోకి విడుదల చేసింది. ఎప్పటికప్పుడు కొత్త ధనం చూపించే మోటోరోలా సంస్థ ఈ సారి అధునాతన ఫీచర్స్ తోMoto E5, Moto E5 plus ని మార్కెట్ లోకి విడుదల చేసింది .కాగా Moto E4,Moto E4 plus విజయవంతమైన నేపధ్యంలో ఈ సిరీస్ కు కొనసాగింపుగా Moto E5,Moto E5 plus ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.ఈ ఫోన్లు బడ్జెట్ ధర లో లభిస్తున్నాయి. ఈ ఫోన్లు కొనాలి అనుకున్నవారు అమెజాన్ లో కొనుగులో చేయవచ్చు.

ధర :
ఈ స్మార్ట్‌ఫోన్లను కంపెనీ బడ్జెట్ ధర లో అందిస్తుంది.కాగా Moto E5 ధరను రూ.9,999, Moto E5 plus ధరను రూ.11,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ రోజు నుంచే అమెజాన్ లో అందుబాటులో ఉంటుంది.

ఆఫర్లు :
Moto E5 plusను SBI క్రెడిట్ కార్డు ద్వారానో డెబిట్ కార్డు ద్వారానో కొనుగోలు చేసిన వారికి రూ.800 క్యాష్ బ్యాక్.
Moto E5 plusను సెలెక్టెడ్ కార్డ్స్ తో కొన్నవారికి 6 నెలల వరకు నో కాస్ట్ EMI.
Moto E5 ,Moto E5 plus కొన్నవారికి జియో తరపున 130జీబీ ఫ్రీ 4జి డేటా.

Moto E5 ఫీచర్లు :
5.7 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Qualcomm Snapdragon 425 ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 Oreo , డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ,4జీ వీవోఎల్‌టీఈ, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Moto E5 plus ఫీచర్లు :
6.0 ఇంచ్ డిస్‌ప్లే, 1440 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్,Qualcomm Snapdragon 425 ప్రాసెసర్, 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్, 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.0 Oreo , డ్యుయల్ సిమ్, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా ,4జీ వీవోఎల్‌టీఈ, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ.

Moto E5 plus బ్యాటరీ హైలైట్ :
Moto E5 plus స్మార్ట్ ఫోన్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంది . Moto E5 ప్లస్ ఇతర Android స్మార్ట్ ఫోన్ల తో పోల్చితే మెరుగైన బ్యాటరీ లైఫ్ ను అందిస్తుంది, ఇది ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతును అందిస్తుంది.


Click it and Unblock the Notifications








