గో ఎడిషన్‌లో Moto E5 Play, ధర ఎంతంటే?

By GizBot Bureau
|

లెనోవో నేతృత్వంలోని మోటరోలా కొద్ది రోజుల క్రితం తన E అలానే G సిరీస్‌ల నుంచి 6 సరికొత్త
స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లో లాంచ్ చేసిన విషయం తెలిసిందే. వీటిలో మూడు ఫోన్‌లను మోటో ఇ సిరీస్ నుంచి మోటరోలా అందుబాటులో ఉంటుంది. మోటో ఇ5, మోటో ఇ5 ప్లస్, మోటో ఇ5 ప్లే పేర్లతో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో మోటో ఇ5 ప్లే మోడల్‌ను తాజాగా లాటిన్ అమెరికా ఇంకా యూరోప్ మార్కెట్లలో మోటరోలా లాంచ్ చేసింది.

 

ధర వివరాలు..

ధర వివరాలు..

యూరోపియన్ మార్కెట్లో ఈ ఫోన్ ధర 109 యూరోలుగా ఉంది. ఇండియన్ కరెన్సీలో ఈ విలువ రూ.8,700. ఆండ్రాయిడ్ గో ఎడిషన్ ఫోన్ ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. మోటో ఇ5 ప్లే మోడల్ ప్రస్తుతానికి లాటిన్ అమెరికా ఇంకా యూరోప్ మార్కెట్లలో మాత్రమే లభ్యమవుతోంది. ఇండియన్ మార్కెట్లో అందుబాటుకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడికావల్సి ఉంది.

మోటో ఇ5 ప్లే (గో ఎడిషన్) స్పెసిఫికేషన్స్..

మోటో ఇ5 ప్లే (గో ఎడిషన్) స్పెసిఫికేషన్స్..

5.2 అంగుళాల 18:9 యాస్పెక్ట్ రేషియో డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో ఆపరేటింగ్ సిస్టం, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 427 సాక్, 1జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 2800mAh బ్యాటరీ.

ఆండ్రాయిడ్ గో (Android Go) అంటే ఏంటి..?
 

ఆండ్రాయిడ్ గో (Android Go) అంటే ఏంటి..?

ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టంను ప్రత్యేకించి ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్‌ల కోసం గూగుల్ అభివృద్ధి చేసింది. ఈ వెర్షన్‌నే ఆండ్రాయిడ్ ఓరియో (గో ఎడిషన్) అని కూడా పిలుస్తున్నారు. 512 ఎంబి ర్యామ్‌తో వచ్చే ఎంట్రీలెవల్ స్మార్ట్‌ఫోన్‌లను కూడా ఈ ఆపరేటింగ్ సిస్టం సపోర్ట్ చేస్తుంది. ఈ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అయ్యే స్మార్ట్‌ఫోన్‌లలో గూగుల్ ప్లే స్టోర్‌తో పాటు ఇతర గూగుల్ యాప్స్ ఇన్‌బిల్ట్‌గా పొందుపరచబడి ఉంటాయి.

ఆండ్రాయిడ్ గో కోసం ప్రత్యేకమైన యాప్స్..

ఆండ్రాయిడ్ గో కోసం ప్రత్యేకమైన యాప్స్..

ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టంను ఉద్దేశించి పలు ప్రత్యేకమైన యాప్‌లను గూగుల్ అందుబాటులోకి తీసుకువచ్చింది. గూగుల్ గో, గూగుల్ అసిస్టెంట్ గో, యూట్యూబ్ గో, గూగుల్ మ్యాప్స్ గో, జీమెయిల్ గో, జీబోర్డ్, గో, ఫైల్స్ గో పేర్లతో లాంచ్ అయిన ఈ యాప్స్ తక్కువ స్టోరేజ్ స్పేస్‌ను ఆక్రమించుకుంటాయి.

Best Mobiles in India

English summary
The Moto E-series was unveiled to cater to the entry-segment as the new offerings - the Moto E5, Moto E5 Plus, and Moto E5 Play - were positioned below the respective Moto G6 models.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X