భారీ బ్యాటరీతో మోటో E5 Plus, సంచలనం రేపుతున్న లీకేజి చిత్రాలు

|

మొబైల్ మార్కెట్లో తనదైన సత్తా చాటుతున్న లెనోవొ బ్రాండ్ మోటో వచ్చే తరం ఫోన్ల మీద ప్రధాన దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. Moto G, Moto Z and Moto E seriesలలో సరికొత్త ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు కసరత్తు చేస్తోందని ఇవి వచ్చే కొన్ని నెలల్లో మార్కెట్లోకి రాబోతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా ఇప్పుడు మోటో ఈ5 ప్లస్‌ లైవ్‌ ఇమేజ్‌లు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఫ్రంట్‌, బ్యాక్‌ ఈ ఫోన్‌ ఎలా ఉండబోతుందో ఈ లైవ్‌ ఇమేజ్‌ల ద్వారా తెలుస్తోంది. చైనా వెబ్‌సైట్ విబో ఈ లైవ్ చిత్రాలను లీక్ చేసింది. కాగా లీకయిన ఫీచర్లపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

 

జియోతో పోటీకి సై అంటున్న ఎయిర్‌టెల్, మార్కెట్లోకి కొత్త ప్లాన్జియోతో పోటీకి సై అంటున్న ఎయిర్‌టెల్, మార్కెట్లోకి కొత్త ప్లాన్

స్లిమ్‌ బెజెల్స్‌తో 18:9 డిస్‌ప్లేను

స్లిమ్‌ బెజెల్స్‌తో 18:9 డిస్‌ప్లేను

స్లిమ్‌ బెజెల్స్‌తో 18:9 డిస్‌ప్లేను ఈ ఫోన్‌ కలిగి ఉంటుందని లైవ్‌ ఇమేజస్‌ రివీల్‌ చేస్తున్నాయి. 5.5 అంగుళాల సైజు, హెచ్‌డీ ప్లస్‌ రెజుల్యూషన్‌ ఇది కలిగి ఉండబోతుందని తెలుస్తోంది. వెనుకాల ఫింగర్‌ప్రింట్‌ సెన్సార్‌, మోటో లోగోతో కర్వ్‌డ్‌ గ్లాస్‌ ఉన్నట్టు రియర్‌ ప్యానల్‌ చూపిస్తోంది.

మోటో ఎక్స్‌4 లాగానే

మోటో ఎక్స్‌4 లాగానే

మోటో ఎక్స్‌4 లాగానే ఇది ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. ముందు వైపు ఒక్కటే కెమెరా ఉండి, అది ఎల్‌ఈడీ ఫ్లాష్‌తో ఉండబోతోంది. మిగతా పార్ట్‌ల గురించి ఈ లైవ్‌ ఇమేజ్‌లు ఎక్కువగా రివీల్‌ చేసింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌డ్రాగన్‌430 ఎస్‌ఓసీ, ఆండ్రాయిడ్‌ ఓరియో, అతిపెద్ద 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

మోటో ఈ5 ప్లస్‌తో పాటు..
 

మోటో ఈ5 ప్లస్‌తో పాటు..

మోటో ఈ5 ప్లస్‌తో పాటు మోటోరోలా మోటో ఈ5ను కూడా లాంచ్‌ చేస్తుందని తెలుస్తోంది. అది 5 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉండబోతోందట. ఆండ్రాయిడ్ ఓరియోతో ఈ ఫోన్లు రానున్నట్లు సమాచారం. అయితే మోటో ఈ5, మోటో ఈ5 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లపై కంపెనీ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఏప్రిల్‌ 3న వీటిని లాంచ్‌ చేయనున్నట్టు కొన్ని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

ఆడియో పరంగా..

ఆడియో పరంగా..

ఆడియో పరంగా ఫోన్ మంచి క్వాలిటీతో రానున్నట్లు తెలుస్తోంది. 3.5mm audio jackతో ఈ ఫోన్ రానున్నదని, అలాగే కింద భాగంలో USB Type-C port ఉండనుందని లీకయిన రిపోర్టులను బట్టి తెలుస్తోంది. కాగా ఈ రెండు ఫోన్లు FCC websiteలో model No XT1922-4 and XT1922-5లతో రిజిస్టర్ అయ్యాయి. అయితే ఇవి Moto E5 and E5 Plus ఫోన్లేనని తెలుస్తోంది.

Best Mobiles in India

English summary
Moto E5 Plus first hands-on images leaked online More News at Gizbot Telugu

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X