మోటో ఎడ్జ్ 50 5G స్మార్ట్‌ఫోన్ విడుదల తేదీ వెల్లడి.. మిలిటరీ గ్రేడ్, సన్నని డిజైన్ సహా సూపర్ ఫీచర్‌లతో..!
మోటోరోలా నుంచి త్వరలో భారత్ మార్కెట్ లోకి మోటో ఎడ్జ్ 50 స్మార్ట్ ఫోన్ (Moto Edge 50 5G Smartphone) లాంచ్ కానుంది. ఈ హ్యాండ్ సెట్ సన్నని డిజైన్ సహా మిలిటరీ గ్రేడ్ తో అందుబాటులోకి రానుంది. ఫలితంగా ఎక్కువ ఉష్ణోగ్రత, ఒత్తిడి సహా డస్ట్ ఇతర పరిస్థితుల నుంచి రక్షిస్తుంది. ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా విడుదల కానుంది. దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
మోటో ఎడ్జ్ 50 అంచనా స్పెసిఫికేషన్‌లు ;
ఈ మోటోరోలా 5G స్మార్ట్ ఫోన్ 6.67 అంగుళాల కర్వడ్ pOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది. 120Hz రీఫ్రెష్ రేట్, 1900 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఆగస్టు 1వ తేదీన విడుదల కానుంది.

వేపర్ కూలింగ్ సిస్టమ్ :
ఈ స్మార్ట్‌ఫోన్ స్నాప్ డ్రాగన్ 7 జెన్ 1 యాక్సిలిరేటెడ్ ఎడిషన్ చిప్‌సెట్ పైన పనిచేస్తుందని తెలుస్తోంది. ఈ హ్యాండ్‌సెట్ 12GB ర్యామ్ మరియు 256GB స్టోరేజీతో జతచేయబడుతుందని తెలుస్తోంది. దీంతోపాటు వేపర్ కూలింగ్ సిస్టమ్ ను కలిగి ఉంటుందని సమాచారం.
68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు :
ఈ మోటో ఎడ్జ్ 50 స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. మూడు సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్ అప్‌డేట్ లు, నాలుగు సంవత్సరాల వరకు సెక్యురిటీ అప్‌డేట్ లు ఇస్తామని సంస్థ చెబుతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ 68W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది.

50MP+ 13MP+ 10MP కెమెరా :
కెమెరా విభాగం పరంగా ఈ స్మార్ట్ ఫోన్ 50MP సోనీ LYT-700C ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, డిజిటల్ జూమ్ సామర్థ్యం కలిగిన 10MP టెలిఫోటో కెమెరాను కలిగి ఉంటుంది. దీంతోపాటు సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP కెమెరాను కలిగి ఉంది.
మూడు రంగుల్లో :
అయితే ఈ మోటో ఎడ్జ్ 50 స్మార్ట్ ఫోన్ ధరపై ఎటువంటి వివరాలు వెల్లడి కాలేదు. అయితే ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్ ప్రారంభం కానుంది. మూడు రంగుల్లో అందుబాటులో ఉండనుంది. జంగిల్ గ్రీన్, వేగాన్ లెదర్ తో కూడిన పాంటోన్ పీచ్ పజ్ మరియు వేగాన్ Suede ఫినిష్‌తో కూడిన కోలా గ్రే రంగుల్లో లభిస్తుంది.
గిజ్ బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరి కొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








