Home
Mobile

50MP కెమెరా, 6.7 అంగుళాల కర్వడ్‌ డిస్‌ప్లేతో Moto 5G స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్లు, సేల్‌ పూర్తి వివరాలు..!!

మోటోరోలా నుంచి తాజాగా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ (Moto Edge 50 Fusion Smartphone) విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ కీలక ఫీచర్లు, స్పెసిఫికేషన్లను కలిగి ఉంది. స్నాప్‌ డ్రాగన్‌ 7s జెన్‌ 2 SoC చిప్‌సెట్‌, 5000mAh బ్యాటరీ సామర్థ్యం, 50MP LYTIA 700C ప్రైమరీ కెమెరాను కలిగి ఉంటుంది. సేల్‌ తేదీలను కూడా మోటోరోలా విడుదల చేసింది.

మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్‌ 6.7 అంగుళాల పుల్‌ HD+ pOLED 3D కర్వడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 1600 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్ అయింది. డిస్‌ప్లే రక్షణకు కార్నింగ్ గొరెల్లా గ్లాస్‌ 5 రక్షణను పొందుతుంది.

Moto Edge 50 Fusion Smartphone launched

ఈ హ్యాండ్‌సెట్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Hello UI పైన పనిచేస్తుంది. మూడు OS అప్‌డేట్‌లు, 4 సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌లను కలిగి ఉంటుంది. స్నాప్‌ డ్రాగన్‌ 7s జెన్‌ 2 SoC చిప్‌సెట్‌తో అడెర్నో 710 GPU తో జతచేయబడి ఉంటుంది. ఈ ప్రాసెసర్‌ 12GB LPDDR4X ర్యామ్‌ మరియు 256GB UFS 2.2 స్టోరేజీని కలిగి ఉంటుంది.

32MP సెల్ఫీ కెమెరా :
ఈ హ్యాండ్‌సెట్‌ వెనుకవైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంటుంది. OIS (ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌) సపోర్టుతో 50MP LYTIA 700C ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్‌ కెమెరాను కలిగి ఉంటుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 32MP ను కలిగి ఉంటుంది. 4K నాణ్యతతో 30fps తో వీడియోలను రికార్డు చేయవచ్చు.

Moto Edge 50 Fusion Smartphone launched

మోటోరోలా ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌ ధర :
దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ 68W టర్బోపవర్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్‌ + 128GB స్టోరేజీ, 12GB ర్యామ్‌ + 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. 8GB ర్యామ్‌ రూ.22,999 గా ఉంది. 12GB ర్యామ్‌ రూ.24,999 గా ఉంది.

ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా సేల్‌.. రూ.2000 డిస్కౌంట్‌ :
ఈ మోటోరోలా ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ సేల్ మే 22 నుంచి మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. ప్రముఖ ఈ కామర్స్‌ వెబ్‌సైట్‌ ఫ్లిప్‌కార్ట్, మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌ Motorola.in, ఇతర ఎంపిక చేసిన స్టోర్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐసీఐసీఐ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు.

ఈ మోటోరోలా ఎడ్జ్‌ 50 ఫ్యూజన్‌ స్మార్ట్‌ఫోన్‌ మూడు రంగుల వేరియంట్‌లలో లభిస్తుంది. ఫారెస్ట్‌ బ్లూ, మార్ష్‌మల్లో బ్లూ మరియు హాట్‌ పింక్‌ రంగుల్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్‌ IP68 రేటింగ్‌తో మెరుగైన వాటర్‌, డస్‌ రెసిస్టెంట్‌గా విడుదల అయింది.

కనెక్టివిటీ పరంగా 4G, 5G, వైఫై, బ్లూటూత్‌ 5.2, GPS, NFC, USB-C ఫీచర్లను కలిగి ఉంటుంది. దీంతోపాటు మోటో కనెక్ట్‌, మోటో సెక్యూర్‌, ఫ్యామిలీ స్పెస్‌, పీసీ సపోర్టు సహా మరిన్ని కనెక్టింగ్‌ ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌ బరువు 175 గ్రాములుగా ఉంది. మరియు 7.9mm థిక్‌నెస్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto Edge 50 Fusion Smartphone launched in india with 50MP LYTIA 700C camera
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X