Home
Mobile

50MP సెల్ఫీ కెమెరా, AI ఫీచర్ల మోటో స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం అయింది.. లాంచ్‌ ఆఫర్‌ కింద భారీ తగ్గింపు..!!

మోటోరోలా నుంచి ఇటీవల మోటో ఎడ్జ్‌ 50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ (Moto Edge 50 Pro 5G sale on Flipkart) లాంచ్ అయింది. తాజాగా ఈ హ్యాండ్‌సెట్ సేల్‌ ప్రారంభం అయింది. మోటోరోలా అధికారిక వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ కర్వడ్‌ డిస్‌ప్లే, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఆధారిత ఫీచర్లను కలిగి ఉంది.

మోటో ఎడ్జ్‌ 50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్‌ +256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.31,999, 12GB ర్యామ్‌ +256GB స్టోరేజీ ధర రూ.35999 గా ఉంది. 8GB ర్యామ్‌ వేరియంట్‌ 68W ఛార్జర్‌, 12GB ర్యామ్‌ వేరియంట్‌ కొనుగోలుపై 125W ఛార్జర్‌ను పొందవచ్చు. Luxe లావెండర్‌, మూన్‌లైట్‌ పెర్ల్‌, బ్లాక్‌ బ్యూటీ రంగుల్లో అందుబాటులో ఉంది.

Moto Edge 50 Pro 5G sale is live on Flipkart offers

రూ.2000 తగ్గింపు :
లాంచ్‌ ఆఫర్‌ కింద రెండు వేరియంట్ల ధరపై రూ.2000 తగ్గింపును ప్రకటన చేసింది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్‌లో HDFC క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. అదే HDFC డెబిట్‌, క్రెడిట్‌ కార్డు ద్వారా EMI లావీదేవీలు నిర్వహిస్తే రూ.2250 వరకు తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా బేస్‌ వేరియంట్‌ను రూ.27,999 కే కొనుగోలు చేయవచ్చు.

మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో 6.7 అంగుళాల కర్వడ్‌ pOLED 1.5k డిస్‌ప్లేను కలిగి ఉంది. మరియు 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, 144Hz రీఫ్రెష్‌ రేట్‌ను కలిగి ఉంటుంది. DC డిమ్మింగ్‌ సపోర్టుతో లాంచ్‌ అయింది. ఈ హ్యాండ్‌సెట్‌ 125W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4500mAh బ్యాటరీని కలిగి ఉంది.

Moto Edge 50 Pro 5G sale is live on Flipkart offers

మూడు OS అప్‌డేట్‌లు :
మోటోరోలా ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Hello UI OS పైన పనిచేస్తుంది. మూడు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు మరియు 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని మోటోరోలా సంస్థ వెల్లడించింది.

ఈ స్మార్ట్‌ఫోన్‌ ప్రపంచంలోనే తొలిసారిగా Pantone తో కూడిన AI ఆధారిత ప్రో గ్రేడ్‌ కెమెరాలను కలిగి ఉన్నట్లు మోటోరోలా వెల్లడించింది. వెనుకవైపు ట్రిపుల్ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్‌ యాంగిల్ కెమెరా (ఈ కెమెరా మ్యాక్రో లెన్స్‌గా కూడా పనిచేస్తుంది). మరియు 3X జూమింగ్‌ సామర్థ్యంతో 10MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుంది.

Moto Edge 50 Pro 5G sale is live on Flipkart offers

దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్ f/1.9 అపేచర్‌, ఆటోఫోకస్‌ సామర్థ్యంతో కూడిన 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది. కెమెరా అనుభూతిని మరింత మెరుగుపరిచేందుకు ఈ ఫోన్‌లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ను ఉపయోగించారు. ఈ ఫోన్ ఇన్‌ డిస్‌ప్లే ఆప్టికల్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్‌ రెసిస్టెన్స్‌తో అందుబాటులో ఉంది.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లు ;
ఏఐ అడాప్టివ్ స్టెబిలైజేషన్, ఇంటెలిజెంట్ ఆటోఫోకస్‌ ట్రాకింగ్‌, అడ్వాన్సడ్ లాంగ్‌ ఎక్స్పోజర్‌, టిల్ట్‌ షిఫ్ట్‌ మోడ్‌ దీంతోపాటు బోకేష్‌ ఇతర ఫీచర్ల పనితీరును మెరుగుపరిచేందుకు AI ఇంజిన్‌ను ఉపయోగించింది. మొత్తంగా ఈ హ్యాండ్‌సెట్‌ మెరుగైన కెమెరా, ఫీచర్లను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto Edge 50 Pro 5G sale is live on Flipkart here are the launch and bank offers
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X