Home
Mobile

50MP సెల్ఫీ కెమెరా, 6.7 అంగుళాల కర్వడ్‌ డిస్‌ప్లే 5G స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌.. ఫీచర్‌లు, సేల్‌ వివరాలు..!!

మోటోరోలా నుంచి ఈ సంవత్సరం ఏప్రిల్‌లో మోటో ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ (Moto Edge 50 Pro 5G Smartphone) విడుదల అయింది. ఈ హ్యాండ్‌సెట్ ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. మిడ్‌ రేంజ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ ను ఫ్లిప్‌కార్ట్‌ లో తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. దీంతోపాటు ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా మరింత తగ్గింపును పొందవచ్చు. 144Hz రీఫ్రెష్‌ రేట్‌ సహా స్నాప్‌ డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్‌ను కలిగి ఉంది.

మోటో ఎడ్జ్‌ 50 ప్రో 5G స్మార్ట్‌ ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు :
మోటో ఎడ్జ్‌ 50 ప్రో 5G స్మార్ట్‌ ఫోన్‌ 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.7 అంగుళాల కర్వడ్‌ pOLED 1.5k డిస్‌ప్లేను కలిగి ఉంది. 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, DC డిమ్మింగ్‌ సపోర్టుతో అందుబాటులో ఉంది.

Moto Edge 50 Pro 5G smartphone price drop

ఈ మోటో స్మార్ట్‌ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Hello UI OS ను కలిగి ఉంది. 3 ఆండ్రాయిడ్‌ అప్‌డేట్‌లు, 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌ లను ఇస్తామని మోటోరోలా సంస్థ హామీ ఇచ్చింది. స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌ పైన పనిచేస్తుంది.

మోటో ఎడ్జ్ 50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్ 125W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 4500mAh బ్యాటరీని కలిగి ఉంది. దీంతోపాటు అనేక ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్లను కలిగి ఉంది. ఇంటెలిజెంట్ ఆటోఫోకస్‌ ట్రాకింగ్‌, ఏఐ అడాప్టివ్ స్టెబిలైజేషన్, అడ్వాన్సడ్ లాంగ్‌ ఎక్స్పోజర్‌, టిల్ట్‌ షిఫ్ట్‌ మోడ్‌ సహా బోకేష్‌ సహా ఇతర ఫీచర్ల పనితీరును మెరుగుపరిచేందుకు AI ఇంజిన్‌ను ఉపయోగించింది.

ఈ మోటో స్మార్ట్‌ ఫోన్‌ Pantone తో కూడిన AI ఆధారిత ప్రో గ్రేడ్‌ కెమెరాలను ఉంది. వెనుకవైపు 50MP ప్రధాన కెమెరా మరియు 13MP అల్ట్రావైడ్‌ యాంగిల్ కెమెరా సహా 3x జూమింగ్‌ సామర్థ్యంతో 10MP టెలిఫోటో లెన్స్‌ను అమర్చారు. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 50MP కెమెరాను కలిగి ఉంది. ఈ కెమెరా ఆటోఫోకస్ ఫీచర్‌ను కలిగి ఉంటుంది.

మోటో ఎడ్జ్‌ 50 ప్రో 5G స్మార్ట్‌ ఫోన్ రెండు వేరియంట్‌లో లభిస్తుంది. 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌, 12GB ర్యామ్‌ + 256GB స్టోరేజీ వేరియంట్‌లలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్‌ ధరకు ఈ హ్యాండ్‌సెట్‌ను కొనుగోలు చేయవచ్చు. లక్స్‌ లావెండర్‌, బ్లూక్‌ బ్యూటీ, మూన్‌లైట్‌ పెర్ల్‌ రంగుల్లో కొనుగోలు చేయవచ్చు.

మోటో ఎడ్జ్‌ 50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ 8GB ర్యామ్, 256GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర ఫ్లిప్‌కార్ట్‌లో 29,999 గా ఉంది. HDFC క్రెడిట్‌ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ఫలితంగా హ్యాండ్‌సెట్‌ను రూ.27,999 కే సొంతం చేసుకున్నారు. IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto Edge 50 Pro 5G smartphone available in discount price on flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X