Home
Mobile

50MP సెల్ఫీ కెమెరా, 6.7 అంగుళాల డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్‌పై డిస్కౌంట్‌.. బ్యాంకు కార్డులపై రూ.2000 తగ్గింపు..!

మోటోరోలా సంస్థ ఇటీవల మోటో ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ ఫోన్‌ను (Moto Edge 50 Pro Smartphone) భారత్‌ మార్కెట్‌ లాంచ్‌ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంది. అయితే తాజాగా స్మార్ట్‌ఫోన్‌ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు.

మోటో ఎడ్జ్‌ 50 ప్రో స్పెసిఫికేషన్లు :
మోటో ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ 6.7 అంగుళాల కర్వడ్‌ pOLED 1.5k డిస్‌ప్లేను కలిగి ఉంది. 144Hz రీఫ్రెష్‌ రేట్‌, 2000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, DC డిమ్మింగ్‌ సపోర్టును కలిగి ఉంది. ఇన్‌ డిస్‌ప్లే ఆప్టికల్‌ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌, IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది.

Moto Edge 50 Pro Smartphone available with discount price

ఎడ్జ్‌ 50 ప్రో స్మార్ట్‌ఫోన్‌ స్నాప్‌ డ్రాగన్‌ 7 జెన్‌ 3 SoC చిప్‌సెట్‌ మరియు ఆండ్రాయిడ్‌ 14 ఆధారిత Hello UI OS పైన పనిచేస్తుంది. మూడు ఆండ్రాయిడ్ OS అప్‌డేట్‌లు మరియు 4 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్లు ఇస్తామని మోటోరోలా సంస్థ వెల్లడించింది.

ఈ హ్యాండ్‌సెట్ Pantone తో కూడిన AI ఆధారిత ప్రో గ్రేడ్‌ కెమెరాలను కలిగి ఉన్నాయి. వెనుకవైపు 50MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్‌ యాంగిల్ కెమెరా మరియు 3X జూమింగ్‌ సామర్థ్యంతో 10MP టెలిఫోటో లెన్స్‌ను కలిగి ఉంటుంది. ఆటోఫోకస్‌ సామర్థ్యంతో కూడిన 50MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

Moto Edge 50 Pro Smartphone available with discount price

మోటో ఎడ్జ్ 50 ప్రో స్మార్ట్‌ఫోన్ 125W ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 50W వైర్‌లెస్‌ ఛార్జింగ్‌ సామర్థ్యంతో 4500mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఏఐ అడాప్టివ్ స్టెబిలైజేషన్, ఇంటెలిజెంట్ ఆటోఫోకస్‌ ట్రాకింగ్‌, అడ్వాన్సడ్ లాంగ్‌ ఎక్స్పోజర్‌, టిల్ట్‌ షిఫ్ట్‌ మోడ్‌ దీంతోపాటు బోకేష్‌ సహా ఇతర ఫీచర్ల పనితీరును మెరుగుపరిచేందుకు AI ఇంజిన్‌ను ఉపయోగించింది.

మోటో ఎడ్జ్‌ 50 ప్రో 5G ధర :
మోటో ఎడ్జ్‌ 50 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ వేరియంట్‌ ధర రూ.31999 గా ఉంది. ఈ వేరియంట్‌తో 68W ఛార్జర్‌ను పొందవచ్చు. మరియు 12GB ర్యామ్‌ +256GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.35999 గా ఉంది. ఈ వేరియంట్‌తో 125W ఛార్జర్‌ను పొందవచ్చు.

Moto Edge 50 Pro Smartphone available with discount price

ఈ హ్యాండ్‌సెట్‌ను (Moto Edge 50 Pro Smartphone Discount Offers) HDFC డెబిట్‌, క్రెడిట్‌ కార్డు ద్వారా EMI లావాదేవీలు నిర్వహిస్తే రూ.2250 తగ్గింపును పొందుతారు. అదే HDFC క్రెడిట్‌ కార్డు నాన్‌ EMI లావాదేవీలతో రూ.2000 తగ్గింపును పొందవచ్చు. ICICI, SBI, యాక్సెస్‌ బ్యాంక్‌, ఫ్లిప్‌కార్ట్‌ యాక్సె్‌స్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే గరిష్టంగా రూ.2000 తగ్గింపును పొందవచ్చు.

దీంతోపాటు ఎంపిక చేసిన స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్చేంజీ చేయడం ద్వారా రూ.3000 తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌ను లక్స్‌ లావెండర్‌, బ్లూక్‌ బ్యూటీ, మూన్‌లైట్‌ పెర్ల్‌ రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఆఫర్‌ ఎప్పుటి వరకు ఉంటుందో సమాచారం లేదు.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto Edge 50 Pro Smartphone available with discount price in flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X