ఈ ఫోన్‌పై రూ.3000 తగ్గింపు.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 256GB స్టోరేజీ, వైర్‌లైస్ ఛార్జింగ్ సహా..!
Moto Edge 60 Stylus Smartphone : మోటోరోలా ఈ సంవత్సరం భారత్ మార్కెట్ లో అనేక మోడల్స్‌ను లాంచ్ చేసింది. మోటోరోలా ఎడ్జ్ 60 సిరీస్‌లో భాగంగా నాలుగు ఫోన్‌లను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా మోటో ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్‌ఫోన్ ఈ సంవత్సరం తొలి భాగంలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను భారీ డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ స్టైలస్ సపోర్టుతోపాటు మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.
రూ.3 వేల డిస్కౌంట్ :
భారత్‌లో విడుదల సమయంలో మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్‌ఫోన్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.22,999 గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ.3 వేల డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. అంటే రూ.19999 కే సొంతం చేసుకోవచ్చు.

దీంతోపాటు ఈ హ్యాండ్‌సెట్‌ను ఎంపిక చేసిన బ్యాంకు కార్డులపై అదనపు డిస్కౌంట్ ను పొందవచ్చు. ఈ ఫోన్ Pantone Surf the web, Pantone Gibraltar sea రెండు కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
మోటోరోలా ఎడ్జ్ 60 స్టైలస్ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల 1.5K 2.5D pOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 3000 నిట్స్ బ్రైట్‌నెస్, 300Hz టచ్ శాంప్లింగ్ రేట్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ కార్నింగ్ గొరిల్లా 3 ప్రొటెక్షన్‌ను పొందుతోంది.
మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్ :
ఈ డిస్‌ప్లే ఆక్వా టచ్ ఫీచర్‌ను సపోర్టు చేస్తుంది. ఫలితంగా తడి చేతులతోనూ ఈ హ్యాండ్‌సెట్ ను ఉపయోగించుకోవచ్చు. ఈ డిస్‌ప్లే Motion Blur Reduction, SGS Low Blue Light వంటి ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్‌ను కలిగి ఉంది.
వైర్‌లెస్ ఛార్జింగ్, 50MP కెమెరా :
ఈ ఫోన్ 68W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్టును కూడా కలిగి ఉంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT 700C కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్, 3 in 1 లైట్ సెన్సర్‌ను కలిగి ఉంది. మరియు 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ 8GB LPDDR4x ర్యామ్, 256GB UFS 2.2 స్టోరేజీతో జతచేసి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తోంది. 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్, 3 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది.
ఈ హ్యాండ్‌సెట్ Moto AI సూట్‌ను కలిగి ఉంది. 5G, 4G, బ్లూటూత్ 5.4, Wi-Fi 6, GPS, NFC, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ IP68 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. భద్రత కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








