కొత్త ‘మోటో జీ’ అమ్మకాలు ప్రారంభం

Posted By:

మోటరోలా కొత్త ఎడిషన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ శుక్రవారం అర్థరాత్రి నుంచి ఇండియన్ మార్కెట్లో లభ్యమవుతోంది. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్  ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఫోన్‌ను రూ.12,999కి విక్రయిస్తోంది. డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమెరీ అలానే మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ సదుపాయంతో ఈ ఫోన్ లభ్యమవుతోంది. పాత వర్షన్ ‘మోటో జీ'తో పోలిస్తే సరికొత్త ఫీచర్లతో మోటో జీ 2014 ఎడిషన్ కనువిందు చేస్తోంది.

కొత్త ‘మోటో జీ’ అమ్మకాలు ప్రారంభం

కొత్త వర్షన్ మోటో జీ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు.. వాటర్ రెసిస్టెంట్ నానో కోటింగ్, 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1020పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెట్జ్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (3జీ, బ్లూటూత్, జీపీఎస్), 2070 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. రెండు స్టీరియో స్పీకర్లను ఫోన్ ముందు భాగంలో అమర్చారు. ఫోన్ బరువు 149 గ్రాములు, మందం 10.99 మిల్లీ మీటర్లు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Moto G (2014) Now Available on Flipkart At Rs 12,999 Along with Launch Day Offers. Read more in Telugu Gizbot......
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot