‘మోటో జీ’ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రూ.8,999కే

Posted By:

మొదటి వర్షన్ ‘మోటో జీ' స్మార్ట్‌ఫోన్ పై మోటరోలా భారీ ధర తగ్గింపును ప్రకటించింది. తాజా ధర తగ్గింపులో భాగంగా 8జీబి వర్షన్ ధర రూ.8,999. 16జీబి వేరియంట్ ధర రూ.9,999. ఈ ఫోన్‌లను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

 ‘మోటో జీ’ స్మార్ట్‌ఫోన్ ఇప్పుడు రూ.8,999కే

మోటో జీ (మొదటి వర్షన్) స్మార్ట్‌ఫోన్‌ను తొలిసారిగా ఫిబ్రవరి 2014లో భారత్ మార్కెట్‌లో విడుదల చేసారు. అప్పటి ధరలను పరిశీలించినట్లయితే 8జీబి వర్షన్ ధర రూ.12,499. 16జీబి వర్షన్ ధర రూ.13,999.

మోటో జీ (సెకండ్ జనరేషన్) స్మార్ట్‌ఫోన్ విడదల నేపథ్యంలో ఫ్లిప్‌కార్ట్ గత నెలలోనే మొదటి వర్షన్ ‘మోటో జీ' విక్రయాలను నిలిపివేసింది. తాజా ధర తగ్గింపుతో మరోసారి మోటరోలా, ఫ్లిప్‌కార్ట్‌లు సంయుక్తంగా మొదటి వర్షన్ ‘మోటో జీ' విక్రయాలను ప్రారంభించాయి.

మోటో జీ (మొదటి జనరేషన్) స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్‌లు:

4.5 అంగుళాల డిస్‌ప్లే ( 720 పిక్సల్ రిసల్యూషన్), ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం (త్వరలోనే ఆండ్రాయిడ్ 5.0 లాలీపప్ అప్‌డేట్‌ను అందుకునే అవకాశం), స్నాప్‌డ్రాగన్ 400 క్వాడ్‌కోర్ ప్రాసెసర్ (క్లాక్ వేగం 1.2 గిగాహెట్జ్), మెమెరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి), 1జీబి ర్యామ్, 5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

English summary
Moto G Available Again At Flipkart, Price Slashed to Rs 8999. Read more in Telugu Gizbot.....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot