మోటో జీ ఫోన్‌లకు ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ అప్‌డేట్

Posted By:

మోటోరోలా నుంచి ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదలైన మోటో జీ డ్యుయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్‌లకు ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ అప్‌డేట్ అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అప్‌డేట్ బరువు 230.7 ఎంబీ. ఈ ఆపరేటింగ్ సిస్టం అప్‌‌గ్రేడ్‌కు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

 మోటో జీ ఫోన్‌లకు ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ అప్‌డేట్

ఇండియన్ మార్కెట్లో మోటో జీ 8జీబి వేరియంట్ ధర రూ.12,499. 16జీబి వేరియంట్ ధర రూ.13,999లకు లభ్యమవుతున్నాయి. ఫ్లిప్ కార్ట్ ద్వారా ఇండియన్ మార్కెట్లో విడుదలైన మోటో జీ హ్యాండ్‌సెట్‌కు ఇండియన్ యూజర్లనుంచి మిశ్రమ స్పందన లభిస్తోంది.

మోటో జీ కీలక స్పెసిఫికేషన్‌లు: 4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్, 329 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి), 5 మెగతా పిక్సల్ రేర్ కమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, 2070ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్), ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టంకు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం). నీటి తాకిడికి గురైనా దెబ్బతినకుండా విధంగా మోటో జీని కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌తోరూపొందించారు.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot