మీ పాత ఫోన్ ఇవ్వండి మోటరోలా మోటో జీ పొందండి!
ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదలైన మోటరోలా మోటో జీ స్మార్ట్‌ఫోన్ భారతీయుల నుంచి అనూహ్యమైన రీతిలో ఆదరణను సొంతం చేసుకుంది. బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్, ఆండ్రాయిడ్ ఆధునిక వర్షన్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం వంటి ప్రత్యేకతలను ఈ ఫోన్ ప్రాముఖ్యతను మరింతగా పెంచేసాయి. ఇండియన్ మార్కెట్లో ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్‌ను ప్రముఖ ఆన్‌లైన్ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రియించిన విషయం తెలిసిందే.

మోటో జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల సంఖ్యను మరింతగా పెంచే క్రమంలో ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఈ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లో భాగంగా ఎవరైనా సరే తమ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ వద్దకు తీసుకుని వెళ్లి రూ.2000 రాయితీతో మోటరోలా మోటీ జీని సొంతం చేసుకోవచ్చు.
మోటోజీ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత మార్కెట్ ధరను పరిశీలించినట్లయితే...16జీబి వర్షన్ మోటోజీ ధర రూ.13,999. 8జీబి వర్షన్ ధర రూ.12,999. ఫ్లిప్‌కార్ట్ అందిస్తోన్న ఆఫర్‌లో భాగంగా మీ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసినట్లయితే. మోటో జీ 16జీబి వర్షన్‌ను రాయితీ పై రూ.11,999కి, 8జీబి వర్షన్‌ను రాయితీ పై రూ.10,999కి సొంతం చేసుకోవచ్చు.
మోటో జీ కీలక స్పెసిఫికేషన్‌లు:
4.5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ 720 x 1280పిక్సల్స్, 329 పీపీఐ పిక్సల్ డెన్సిటీ), ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం 1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 400 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమెరీ వేరియంట్స్ (8జీబి, 16జీబి), 5 మెగా పిక్సల్ రేర్ కమెరా (ఎల్ఈడి ఫ్లాష్), 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0, జీపీఎస్, 2070ఎమ్ఏహెచ్ బ్యాటరీ, డ్యుయల్ సిమ్ (జీఎస్ఎమ్+జీఎస్ఎమ్).
మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.
వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.


Click it and Unblock the Notifications