ఫిబ్రవరి 5న మోటరోలా స్మార్ట్‌ఫోన్ ‘మోటో జీ’ విడుదల

Posted By:

ఫిబ్రవరి 5న మోటరోలా స్మార్ట్‌ఫోన్ ‘మోటో జీ’ విడుదల

గూగుల్ కంపెనీలో విలీనం అనంతరం మోటరోలా కంపెనీ ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ 'మోటో జీ' ఇండియన్ మార్కెట్లో విడుదలకు సంబంధించి అధికారిక సమాచారం వెలువడింది. 'మోటో జీ' స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్లో ఫిబ్రవరి 5న ఆవిష్కరించనున్నట్లు మోటరోలా ఇండియా తన ఫేస్‌బుక్ ఇంకా ట్విట్టర్ అకౌంట్‌లలో పేర్కొంది.

మీరు ఎంపిక చేసుకోబోయే స్మార్ట్‌ఫోన్ ఇంకా ట్యాబ్లెట్ పీసీకి సంబంధించిన ధరలను ఇక్కడ క్లిక్‌చేసి చూసుకోండి.

మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ను ముందుగా నవంబర్ 2013లో ప్రకటించారు. ఆ తరువాత ఈ స్మార్ట్ మొబైలింగ్ డివైస్ విడుదలకు సంబంధించి అనేక పుకార్లు షికార్లు చేసాయి. 'మోటో జీ'  ఆవిష్కరణ జనవరిలోనే ఉంటుందని అభిమానులు అనుకున్నారు. అయితే, ఫోన్ విడుదల తేదీ కాస్తా ఫిబ్రవరి 5కు చేరింది. మోటరోలా అభిమానులు మరో 15 ఓపికపట్టినట్లయితే మోటో జీ వారి సొంతమవుతుంది.

వివిధ మోడళ్ల స్మార్ట్‌ఫోన్‌లకు సంబంధించిన ఫోటో గ్యాలరీల కోసం క్లిక్ చేయండి.

మోటరోలా 'మోటో జీ' కీలక స్పెసిఫికేషన్లు:

4.5 అంగుళాల ప్రకాశవంతమైన ఇంకా స్పష్టమైన ఎల్సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్ధ్యం 1280 x 720 పిక్సల్స్, 329 పీపీఐ),
సింగిల్ సిమ్ ఇంకా డ్యుయల్ సిమ్ వేరియంట్,
ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టం,
1.2గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్,
అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసర్,
1జీబి ర్యామ్,
ఇంటర్నల్ మెమరీ 8జీబి వేరియంట్, 16జీబి వేరియంట్,
5 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
1.3 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా,
3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్, మైక్రో యూఎస్బీ కనెక్టువిటీ,
2070ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

అనధికారికంగా అందుతున్న వివరాల మేరకు మోటో జీ స్మార్ట్‌ఫోన్ 8జీబి వర్షన్ ధర రూ.13,000, 16జీబి వర్షన్ ధర రూ.16,000గా ఉండొచ్చని అంచనా.

మోటో జీ కొనుగోలు పై అందుబాటులో ఉన్న 5 అత్యుత్తమ ఆన్‌లైన్ డీల్స్‌ను తెలుసుకునేందకు క్లిక్ చేయండి.

''యూసీ బ్రౌజర్‌ను ఎందుకు ఇష్టపడుతున్నారో చెప్పండి. ఆపై, గెలుచుకోండి నెక్సూస్5 32జీబి వర్షన్‌ను ఉచితంగా''

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot