Moto కొత్త స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు లీక్.. లాంచ్, పూర్తి వివరాలు..!
మోటో క్రమంగా (Moto India) భారత్‌లో తమ ఫోర్ట్‌ఫోలియోను విస్తరిస్తోంది. మోటో జీ పవర్ 5G స్మార్ట్ ఫోన్‌కు తర్వాత తరం హ్యాండ్‌సెట్‌గా మోటో జీ పవర్ 5G స్మార్ట్ ఫోన్ 2024 (Moto G Power 5G 2024) ఈ సంవత్సరం విడుదల చేయనుంది.
ఈ ఫోన్ గురించి ఇప్పటికే అనేక వివరాలు లీక్ అయ్యాయి. తాజాగా ఈ హ్యాండ్‌సెట్ కలర్ ఆప్షన్ సమాచారం లీక్ అయింది. ఎంఎస్ పవర్‌యూజర్ రిపోర్ట్ ఆధారంగా మోటో G పవర్ 2024 స్మార్ట్‌ఫోన్ బ్లూ, బీజ్ రంగుల్లో కనిపించింది. అవుటర్ స్పేస్ మరియు ఆర్చిడ్ టింట్ రంగుల్లో మార్కెట్ చేయబడే అవకాశం ఉంది.

పుల్ HD+ డిస్‌ప్లే సహా 30W ఫాస్ట్ ఛార్జింగ్ : మోటో జీ పవర్ 5G 2024 స్మార్ట్‌ఫోన్ 30W వైరడ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో వచ్చే అవకాశం ఉంది. మరియు 1200*1600 పిక్సల్ రిజల్యూషన్‌తో పుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉండే అవకాశం ఉంది.
6.7 అంగుళాల కెమెరా : అయితే గతంలో లీక్ అయిన వివరాల ఆధారంగా ఈ మోటో G పవర్ 5G 2024 స్మార్ట్ ఫోన్ 6.7 అంగుళాల ఫ్లాట్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. మరియు దీర్ఘచతురస్రాకార కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంటుంది.
డ్యూయల్ కెమెరా మరియు LED ఫ్లాష్ : ఇప్పటికే విడుదలైన ఈ హ్యాండ్‌సెట్ ఫొటోల ఆధారంగా ఈ ఫోన్ వెనుక ఎడమవైపు కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉంది. దీని ఆధారంగా ఈ ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరా మరియు LED ఫ్లాష్ యూనిట్.
స్లిమ్ బెజెల్స్ మరియు సెంటర్ పంచ్ హోల్ డిజైన్ : దీంతోపాటు ఈ మోటో (Moto New Smartphone) స్మార్ట్ ఫోన్ సెంటర్ పంచ్ హోల్ డిజైన్‌ను కలిగి ఉంది. మరియు స్లిమ్ బెజెల్స్‌తో వస్తుంది. దీంతోపాటు వాల్యూమ్ బటన్లు హ్యాండ్‌సెట్ కుడివైపున ఉంది. దాంతోపాటు స్పీకర్లు, USB-C ఛార్జింగ్ పోర్టు, 3.5mm ఆడియో జాక్ లను హ్యాండ్‌సెట్ కిందవైపున ఉన్నాయి.
మోటో G పవర్ 5G 2023 స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు : మోటో G పవర్ 5G 2023 స్మార్ట్ ఫోన్ 120Hz రీఫ్రెష్ 6.5 అంగుళాల పుల్ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతోపాటు 50MP తో కూడిన ట్రిపుల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 10W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. 6GB ర్యామ్ + 256GB అంతర్గత స్టోరేజీలో లాంచ్ అయింది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్ సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications