6.6 అంగుళాల డిస్‌ప్లే, 8GB ర్యామ్‌తో Moto స్మార్ట్‌ఫోన్.. ఫీచర్లు, సేల్ వివరాలు..!
మోటోరోలా సంస్థ భారత్‌లో మోటో G04 స్మార్ట్ ఫోన్ ( Moto G04 Smartphone ) ను త్వరలో లాంచ్ చేయనుంది. ఈ హ్యాండ్‌సెట్ భారత్‌లో ఫిబ్రవరి 15న విడుదల కానుంది. అనంతరం ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉండనుంది.
రెండు వేరియంట్లలో అందుబాటులోకి.. : ఈ మోటో G04 స్మార్ట్ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉండనుంది. అవి 4GB ర్యామ్ + 64GB అంతర్గత స్టోరేజీ, 8GB ర్యామ్ + 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆకట్టుకొనే డిజైన్ సహా ఆకర్షణీయమైన రంగుల్లో లభిస్తుంది.

ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS : మోటో G04 హ్యాండ్ సెట్ 6.6 అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. 90Hz రీఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OSను కలిగి ఉంటుంది. మరియు Unisoc T606 ప్రాసెసర్ పైన పనిచేస్తుంది.
16MP AI కెమెరా : మోటో స్మార్ట్‌ఫోన్ వెనుకవైపు 16MP AI కెమెరా. LED ప్లాష్‌ను కలిగి ఉంటుంది. దీంతో పోర్ట్రెయిట్ మోడ్‌లో స్టన్నింగ్ ఫొటోలు తీసుకొనే అవకాశం ఉంది. అలాగే సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 5MP కెమెరాను కలిగి ఉంటుంది.

దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ 4GB, 8GB ర్యామ్ మరియు 64GB, 128GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. మరియు ఈ స్మార్ట్‌ఫోన్‌లో గరిష్ఠంగా 15GB వరకు ర్యామ్ బూస్టింగ్ చేయవచ్చు. IP52 రేటింగ్‌తో డస్ట్ మరియు స్లాష్ రెసిస్టెన్స్‌తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంటుంది.
5000mAh బ్యాటరీతో.. : ఈ స్మార్ట్ ఫోన్ గ్లోబల్ వేరియంట్ 10W ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. అదే భారత్‌లో ఎంత ఛార్జింగ్ సపోర్టుతో అందుబాటులోకి వస్తుందనే వివరాలు వెల్లడి కాలేదు. ఈ మోటో కొత్త హ్యాండ్‌సెట్ 3.5 mm ఆడియో జాక్ మరియు మెరుగైన సౌండ్ క్వాలిటీ కోసం డాల్బీ అట్మాస్ వ్యవస్థను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
మోటో G04 స్మార్ట్ ఫోన్ ధర! : భారత్ మార్కెట్‌లో ఈ మోటో G04 స్మార్ట్‌ఫోన్ ధర ఎంత ఉంటుందనే సమాచారం బయటకు రాలేదు. అయితే ఇటీవల ఈ హ్యాండ్‌సెట్ యూరప్‌లో విడుదల అయింది. ఆ దేశంలో ఈ ఫోన్ ధర EUR 119 ( భారత కరెన్సీలో రూ.10,751 ) గా ఉంది. కాన్‌కార్డ్ బ్లాక్, సాటిన్ బ్లూ, సీ గ్రీ, సన్‌రైజ్ ఆరెంజ్ రంగుల్లో లభిస్తుంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications