ధర రూ.6999 కే 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ Moto స్మార్ట్‌ఫోన్ విడుదల.. సేల్ వివరాలు.. !
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ మోటోరోలా ఇటీవల భారత్‌లో వరుసగా స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేస్తోంది. కొన్ని రోజుల క్రితం మోటోరోలా ఎడ్జ్ 50 ఫ్యూజన్ హ్యాండ్‌సెట్‌ను లాంచ్ చేసింది. తాజాగా మోటోరోలా సంస్థ మోటో G04s స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ అత్యంత తక్కువ ధరలో అందుబాటులో ఉంది. మరియు మెరుగైన స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లను కలిగి ఉంది. మరియు మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్టును కలిగి ఉంటుంది. కాంకర్డ్ బ్లాక్, సీ గ్రీన్, శాటిన్ బ్లూ, సన్‌రైజ్ ఆరెంజ్ రంగుల్లో లభిస్తుంది.
మోటో G04s స్మార్ట్‌ఫోన్ (Moto G04s Smartphone) 4GB ర్యామ్ + 64GB అంతర్గత స్టోరేజీ వేరియంట్ ధర రూ.6999 గా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ జూన్ 5 నుంచి ప్రారంభం కానుంది. మోటోరోలా అధికారిక వెబ్‌సైట్ మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ మోటో స్మార్ట్‌ఫోన్‌ను యూక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. మరియు EMI ఆప్షన్‌లను కూడా పొందవచ్చు.

మోటో G04s స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
మోటో G04s స్మార్ట్‌ఫోన్ 6.6 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 1612*720 పిక్సల్ రిజల్యూషన్, 90Hz రీఫ్రెష్ రేట్, 537 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌తో లాంచ్ కానుంది. దీంతోపాటు డిస్‌ప్లే కోసం కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 రక్షణ పొందుతుంది.
ఈ మోటో కొత్త స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత OS పైన పనిచేస్తుంది. మరియు Unisoc T606 SoC చిప్‌సెట్ పైన పనిచేస్తుంది. Mail G57 GPU ప్రాసెసర్‌తో జతచేయబడింది. ఈ హ్యాండ్‌సెట్ 8GB LPDDR4X ర్యామ్ మరియు 64GB UF 2.2 స్టోరేజీని కలిగి ఉంటుంది. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకోవచ్చు.
50MP కెమెరా, 5000mAh బ్యాటరీ :
ఈ మోటో G04s స్మార్ట్‌ఫోన్ 50MP ప్రధాన కెమెరాను కలిగి ఉంటుంది. మరియు వెనుకవైపు LED ఫ్లాష్ లైట్‌తో వచ్చింది. సెల్ఫీ మరియు వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్ 5MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది.
మోటో G04S స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ పరంగా 4G LTE, వైఫై 802.11, బ్లూటూత్ 5.0, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంటుంది. IP52 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా లాంచ్ కానుంది. మరియు భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంది.
గిజ్‌బాట్ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.


Click it and Unblock the Notifications








