Home
Mobile

కేవలం రూ.6,999కే అదిరిపోయే ఫీచర్లతో మోటో G05 లాంచ్.. ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకాలు!

By Ram Kumar

మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి అదిరే శుభవార్త. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ మోటోరోలా (Motorola) ఈరోజు తన సరికొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను భారతీయ మార్కెట్‌లోకి విడుదల చేసింది. అదే మోటో జీ05 (Moto G05). ఇది గత సంవత్సరం ఫిబ్రవరిలో విడుదలైన మోటో G04కు (Moto G04) కొనసాగింపుగా వస్తోంది.

ఈ కొత్త ఫోన్‌లో అనేక అప్‌గ్రేడ్లు ఉన్నాయి. మెరుగైన కెమెరాలు, ఫాస్ట్ ప్రాసెసర్, మరింత శక్తివంతమైన బ్యాటరీ వంటి ప్రత్యేకతలు దీని సొంతం. అంతేకాదు, ఇది స్టైలిష్ వేగన్ లెదర్ డిజైన్‌తో వస్తుంది. ప్రత్యేకించి పాంటోన్ (Pantone) క్యూరేట్ చేసిన ప్రత్యేక రంగుల్లో లభిస్తుంది.

Moto G05 Launched at Rs 6999 in India  Flipkart Sale Starts January 13

మోటో జీ05 ధర

ఇది కేవలం ఒక్క వేరియంట్‌లోనే లభిస్తుంది. 4జీబీ RAM + 64జీబీ స్టోరేజ్‌తో కూడిన ఈ ఫోన్ ధర కేవలం రూ.6,999 మాత్రమే. ఇది ప్లమ్ రెడ్ (Plum Red), ఫారెస్ట్ గ్రీన్ (Forest Green) అనే రెండు అదిరిపోయే రంగుల్లో లభిస్తుంది. ఈ రెండు రంగులు కూడా వెగన్ లెదర్ ఫినిషింగ్‌తో వస్తాయి. ఈ ఫోన్ జనవరి 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ద్వారా ప్రత్యేకంగా కొనుగోలు చేయడానికి అందుబాటులోకి వస్తుంది.

మోటో G05 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే, ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లే ఉంది. ఇది మరింత స్పష్టమైన విజువల్స్‌ను అందిస్తుంది. అంతేకాకుండా, 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో వస్తుంది. దీనివల్ల బయట సూర్యకాంతిలో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. స్క్రీన్‌ను గీతలు, డ్రాప్స్ నుంచి రక్షించడానికి గొరిల్లా గ్లాస్ 3 రక్షణ కూడా ఉంది. ప్రత్యేకంగా, నీటి స్పర్శను గుర్తించే టెక్నాలజీని కూడా దీని సొంతం.

* ప్రాసెసర్

ఈ మొబైల్ మీడియాటెక్ హీలియో జీ81 ఎక్స్‌ట్రీమ్ (MediaTek Helio G81 Extreme) ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆ ప్రైస్ రేంజ్‌లో ఇది ఆశించదగిన పర్ఫామెన్స్ ఆఫర్ చేస్తుంది. కెమెరాల విషయానికి వస్తే, వెనుకవైపు 50MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇది పోర్ట్రెయిట్ మోడ్, ఆటో నైట్ విజన్ వంటి ఫీచర్లను కూడా అందించడం విశేషం. దీని ద్వారా తక్కువ వెలుతురులో కూడా మంచి ఫొటోలను తీయవచ్చు. ముందువైపు సెల్ఫీల కోసం 8MP కెమెరా ఉంది.

* బ్యాటరీ, ఛార్జింగ్

ఈ ఫోన్‌లో 5,200mAh బ్యాటరీ ఉంది. ఇది ఒకసారి ఛార్జ్ చేస్తే రెండు రోజుల వరకు వస్తుందని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా, ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది. దీని ద్వారా ఫోన్‌ను త్వరగా ఛార్జ్ చేసుకోవచ్చు.

ఇది ఆండ్రాయిడ్ 15 (Android 15) ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. రెండు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లను కంపెనీ హామీ ఇస్తోంది.

* ఇతర ఫీచర్లు

ఈ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ IP52 రేటింగ్‌తో వస్తుంది. అంతేకాకుండా, డాల్బీ అట్మాస్ (Dolby Atmos) సపోర్ట్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఇందులో అందించడం మరో విశేషం. ఇది మెరుగైన సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. Hi-res ఆడియోకు కూడా మద్దతు ఇస్తుంది. ఛార్జింగ్, డేటా ట్రాన్స్‌ఫర్ కోసం USB టైప్-C పోర్ట్ కూడా ఉంది.

మోటో G05 తన సక్సెసర్ మోటో G04తో పోలిస్తే అనేక ఇంప్రూవ్ మెంట్స్‌తో వస్తుందని చెప్పుకోవచ్చు. ఇది దానికంటే పెద్దది, బ్రైట్ డిస్‌ప్లేను కలిగి ఉంది. కెమెరాలు కూడా మంచి అప్‌గ్రేడ్స్‌ పొందుతున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Motorola launched the Moto G05 in India at Rs 6,999. It features a 6.67-inch display, 50MP camera, MediaTek Helio G81 processor, 5,200mAh battery, and runs Android 15. Sale starts January 13.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X