Home
Mobile

పేరుకే బడ్జెట్‌ రేంజ్‌ ఫోన్‌ కానీ ఎన్ని ప్రీమియం ఫీచర్‌లు ఉన్నాయో.. ఈ డేట్‌ సేవ్‌ చేసి పెట్టుకోండి..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ మోటోరోలా నుంచి బడ్జెట్‌ ధరలో మరో హ్యాండ్‌సెట్‌ విడుదల కానుంది. మోటో G05 (Moto G05 Smartphone) పేరుతో భారత్‌ మార్కెట్‌ లో ఈ నెలలోనే లాంచ్‌ కానుంది. బడ్జెట్‌ ధరలోనే విడుదల కానుందని భావిస్తున్న ఈ హ్యాండ్‌సెట్ ప్రీమియం ఫీచర్‌లను కలిగి ఉంది. ప్రముఖ ఇ-కామర్స్‌ ప్లాట్‌ఫాం ఫ్లిప్‌కార్ట్ లో లిస్టింగ్‌ అయింది. దీని ఆధారంగా ఈ స్మార్ట్‌ఫోన్‌ అనేక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు వెల్లడయ్యాయి.

ఎప్పుడు విడుదల కానుంది? :
ఫ్లిప్‌కార్ట్ ఆధారంగా మోటో G05 స్మార్ట్‌ఫోన్ జనవరి 7 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భారత్‌ మార్కెట్‌లో విడుదల కానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్‌ ల్యాండింగ్‌ పేజీ ఆధారంగా డిజైన్‌తోపాటు అనేక వివరాలు వెల్లడయ్యాయి.

moto G05 Smartphone launch

మోటో G05 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.67 అంగుళాల HD+ LCD డిస్‌ప్లేతో విడుదల కానుంది. 720*1612 పిక్సల్స్‌ రిజల్యూషన్‌, 90Hz రీఫ్రెష్ రేట్‌, 1000 నిట్స్‌ గరిష్ట బ్రైట్‌నెస్‌తో కూడిన పంచ్ హోల్ డిజైన్‌ను కలిగి ఉంటుంది.

వేగాన్‌ లెదర్‌, వాటర్‌ టర్‌ ఫీచర్‌ :
ఈ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్ 3 రక్షణను పొందుతుంది. మరియు డిస్‌ప్లే వాటర్‌ టచ్‌ టెక్నాలజీని సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ వెనుక ప్యానల్‌ వేగాన్‌ లెదర్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. బడ్జెట్‌ ఫోన్‌లో ఇది ప్రీమియం ఫీచర్‌గా నిలుస్తుంది. మరియు గ్రీన్‌, రెడ్‌ రంగుల్లో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది.

moto G05 Smartphone launch

ఆండ్రాయిడ్ 15 OS :
ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS ను కలిగి ఉంటుంది. థెఫ్ట్‌ ప్రొటెక్షన్‌ సహా అనేక భద్రతా ఫీచర్‌లు ఈ OS ద్వారా అందుబాటులోకి వస్తాయి. 2 సంవత్సరాలపాటు సెక్యూరిటీ అప్‌డేట్‌లను పొందవచ్చని మోటో చెబుతోంది. ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ హీలియో G81 ఎక్స్‌ట్రీమ్ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.

ఈ చిప్‌సెట్‌ 4GB ర్యామ్‌ మరియు 64GB స్టోరేజీతో జతచేసి ఉంటుంది. మరియు 12GB వరకు ర్యామ్‌ను అదనంగా పొడిగించే అవకాశం ఉంది. ఈ ఫోన్‌ డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. మరియు IP52 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌గా ఉంది.

కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు 50MP క్వాడ్‌ పిక్సల్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. పొర్ట్రెయిట్‌, ఆటో నైట్‌ విజన్‌ మోడ్‌ను సపోర్టు చేస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP కెమెరాను అమర్చి ఉంటుంది. 18W ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్టుతో 5200mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 2 రోజులపాటు వినియోగించుకోవచ్చని మోటోరోలా చెబుతోంది.

మోటో G04 స్మార్ట్‌ఫోన్‌కు తర్వాత తరం హ్యాండ్‌సెట్‌గా G05 విడుదల కానుంది. భారత్‌ మార్కెట్‌లో రూ.10000 కంటే తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది. ఈ ఫోన్‌ ఎన్ని వేరియంట్‌లో భారత్‌లో విడుదల కానుందో వెల్లడి కాలేదు. మరియు ఫ్లిప్‌కార్ట్ ద్వారా సేల్‌ ప్రారంభం కానుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
moto G05 Smartphone launch date confirmed in india here are the specifications and features
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X