Home
Mobile

ధర రూ.6999 కే 50MP కెమెరా, 5200mAh బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 15 OS స్మార్ట్‌ఫోన్‌..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ మోటోరోలా నుంచి ఇటీవలే మోటో G05 స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఎంట్రీ లెవల్ ధర సెగ్మెంట్‌లో అందుబాటులోకి వచ్చిన ప్రీమియం తరహా డిజైన్‌ సహా అద్భుతమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ సేల్‌ ఇవాళ్టి నుంచి ప్రారంభం అయింది. మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆఫ్‌లైన్‌ రిటైల్‌ స్టోర్‌ల ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ అనేక ప్రీమియం ఫీచర్‌లను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 50MP కెమెరా సహా 5200mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. మోటోరోలా కొత్త స్మార్ట్‌ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు.

మోటో G05 స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్‌ వివరాలు :
మోటో G05 స్మార్ట్‌ఫోన్‌ ప్రస్తుతం 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్‌లోనే అందుబాటులో ఉంది. దీని ధర రూ.6,999 గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్‌ బ్యాంకు క్రెడిట్‌ కార్డు ద్వారా 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. అయితే రూ.449 ప్లాన్ కలిగిన జియో యూజర్లు గరిష్ఠంగా రూ.3000 విలువైన వరకు అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ ఫోన్‌ పారెస్ట్ గ్రీన్‌, ప్లమ్‌ రెడ్‌ రంగుల్లో లభిస్తుంది.

Moto G05 smartphone sale is live on flipkart

మోటో G05 స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లు :
మోటో G05 హ్యాండ్‌సెట్ 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.67 అంగుళాల (720*1612 పిక్సల్స్‌) LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 1000 నిట్స్‌ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు వాటర్ టచ్‌ టెక్నాలజీని సపోర్టు చేస్తుంది.

ఈ మోటో కొత్త ఫోన్‌ డిస్‌ప్లే కార్నింగ్‌ గొరెల్లా గ్లాస్ 3 రక్షణను పొందుతుంది. పంచ్‌హోల్‌ డిజైన్‌ను కలిగి ఉంది మరియు వేగాన్‌ లెదర్‌ బ్యాక్ ప్యానల్‌తో లాంచ్‌ అయింది. IP52 రేటింగ్‌తో డస్ట్‌ మరియు వాటర్‌ రెసిస్టెన్స్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్‌ 18W వైర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తోంది.

ఈ మోటో ఎంట్రీ లెవల్‌ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ హీలియో G81 Extreme SoC ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. 4GB LPDDR4X ర్యామ్, 64GB స్టోరేజీతో జత చేసి ఉంది. వర్చువల్‌గా 12GB వరకు ర్యామ్‌ను మరియు మైక్రో SD కార్డుతో 1TB వరకు స్టోరేజీని పెంచుకొనే అవకాశం ఉంది.

ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Hello UI (స్కిన్‌ ఆన్‌ టాప్‌) OS ను కలిగి ఉంది. థెఫ్ట్‌ ప్రొటెక్షన్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉంటుంది. రెండు సంవత్సరాలపాటు ఆండ్రాయిడ్‌, సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందుతుంది. మరియు కెమెరా విభాగం పరంగా క్వాడ్‌ పిక్సల్‌ టెక్నాలజీతో కూడిన 50MP ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్‌ కోసం 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.

కనెక్టివిటీ పరంగా డ్యూయల్‌ 4G LTE, వైఫై, బ్లూటూత్‌ 5.4, GPS, A-GPS, FM రేడియో, Galileo, LTEPP, SUPL, Glonass, USB-C ఛార్జింగ్‌ సహా 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో డ్యూయల్‌ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను అమర్చారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto G05 smartphone sale is live on flipkart in india check price and sale deals
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X