రూ.6999 కే ప్రీమియం లుక్‌తో అందుబాటులో ఉన్న ఫోన్ కోసం తెలుసా.. 5200mAh బ్యాటరీ. 50MP కెమెరా సహా..!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ మోటోరోలా ఈ సంవత్సరం జనవరిలో ఎంట్రీ లెవల్ ధరలో సూపర్ ఫీచర్‌లతో మోటోరోలా G05 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రూ.6999 కే ప్రస్తుతం అందుబాటులో ఉంది. తక్కువ ధరలో విడుదల అయినా ప్రీమియం లుక్‌ను కలిగి ఉంది. మరియు మెరుగైన స్పెసిఫికేషన్‌లతో అందుబాటులో ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 5200mAh బ్యాటరీని కలిగి ఉంది.
ధర వివరాలు :
మోటో G05 స్మార్ట్‌ఫోన్ (Moto G05 Smartphone) భారత్ మార్కెట్‌లో కేవలం ఒకే స్టోరేజీ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.6999 గా ఉంది. కాలింగ్, బ్రౌజింగ్, ఎంటర్‌టైన్‌మెంట్ కోసం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వారికి ఈ హ్యాండ్‌సెట్ అత్యంత అనుకూలంగా ఉంటుంది.

ప్రస్తుతం ప్రముఖ ఇ-కామర్స్ ఫ్లాట్‌ఫాంలో మోటో G05 హ్యాండ్‌సెట్ పై డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సెస్ బ్యాంకు క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. ఈ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ ప్లమ్ రెడ్, పారెస్ట్ గ్రీన్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
చిప్‌సెట్ వివరాలు :
మోటో G05 స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో G81 Extreme SoC చిట్‌సెట్ తో పనిచేస్తోంది. ఈ ప్రాసెసర్ గరిష్ఠంగా 4GB LPDDR4X ర్యామ్, 64GB స్టోరేజీతో జతచేసి ఉంది. వర్చువల్‌గా ర్యామ్‌ను పెంచుకొనే అవకాశం ఉందని మోటో తెలిపింది. దీని ఆధారంగా 12GB వరకు వర్చువల్‌గా ర్యామ్‌ను పొడిగించుకోవచ్చు. మైక్రో SD కార్డుతో 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చు.
5200mAh బ్యాటరీ :
ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI (Skin On Top) OS ను కలిగి ఉంది. ఈ ఫోన్ కోసం 2 ఆండ్రాయిడ్ OS అప్‌డేట్స్‌తోపాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ను పొందవచ్చని మోటోరోలా తెలిపింది. ఈ ఫోన్ 18W వైర్ ఛార్జింగ్ సపోర్టుతో 5200mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
డిజైన్ పరంగా ఈ హ్యాండ్‌సెట్ వేగాన్ లెదర్ బ్యాక్ ప్యానల్‌ను కలిగి ఉంది. ఫలితంగా ప్రీమియం లుక్‌ను సొంతం చేసుకుంది. దీంతోపాటు పంచ్ హోల్ డిజైన్‌తో కలిగి ఉంది. వాటర్ టచ్ టెక్నాలజీని సపోర్టు చేస్తుంది. IP52 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది.
50MP ప్రైమరీ కెమెరా :
ఈ ఫోన్ 6.67 అంగుళాల (720*1612 పిక్సల్స్) LCD డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 90Hz రీఫ్రెష్ రేట్, 1000 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. మరియు డిస్‌ప్లే కార్నింగ్ గొరెల్లా గ్లాస్ 3 రక్షణను పొందుతుంది. కెమెరా విభాగం పరంగా క్వాడ్ పిక్సల్ టెక్నాలజీతో 50MP ప్రైమరీ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను అమర్చారు.
ఈ మోటోరోలా G05 స్మార్ట్‌ఫోన్ భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్టుతో డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లను అమర్చారు. కనెక్టివిటీ పరంగా 4G LTE, బ్లూటూత్ 5.4, WiFi, GPS, A-GPS, FM రేడియో, Galileo, Glonass, USB-C, 3.5mm ఆడియో జాక్‌ను కలిగి ఉంది.


Click it and Unblock the Notifications








