రూ.8 వేల ధర రేంజ్‌లో భారీ బ్యాటరీ, భారీ డిస్‌ప్లే ఫోన్ కోసం చూస్తున్నారా?
మోటోరోలా సంస్థ గత సంవత్సరం పవర్ పేరుతో అనేక ఫోన్‌లను లాంచ్ చేసింది. ఈ మోడల్స్ అధిక బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. అయితే గత అక్టోబర్ లో ఎంట్రీ లెవల్ ధరలో మోటో G06 పవర్ స్మార్ట్‌ఫోన్ ను (Moto G06 Power 5G Smartphone) తీసుకొచ్చింది. ఈ ఫోన్ 7000mAh భారీ బ్యాటరీ, 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ వేగాన్ లెదర్ బ్యాక్ ప్యానల్ ను కలిగి ఉంది.
ధర రూ.7999 ధరకే :
మోటో G06 పవర్ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7999 గా ఉంది. మోటోరోలా ఇండియా వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్స్ లో కొనుగోలు చేయవచ్చు. భారత్ మార్కెట్ లో రూ.8 వేల ధరలో భారీ బ్యాటరీ, భారీ డిస్‌ప్లే ఫోన్ కోసం చూస్తున్న వారికి ఈ హ్యాండ్‌సెట్ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.

భారీ డిస్‌ప్లే :
మోటో G06 పవర్ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ 6.88 అంగుళాల HD+ డిస్‌ప్లేతో అందుబాటులో ఉంది. ఈ డిస్‌ప్లే 600 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ను పొందుతోంది. ఈ హ్యాండ్‌సెట్ పాంటోన్ టెండ్రిల్, పాంటోన్ లారెల్ ఓక్, పాంటోన్ టేప్‌స్ట్రీ కలర్ వేరియంట్స్ లో అందుబాటులో ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ హీలియో G81 ఎక్స్‌ట్రీమ్ SoC చిప్‌సెట్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తోంది. ఈ ఫోన్ ప్రస్తుతం 4GB/6GB వేరియంట్ లో లభిస్తుంది. మైక్రో SD కార్డుతో 1TB వరకు స్టోరేజీని పెంచుకోవచ్చని మోటో తెలిపింది.

50MP కెమెరా, 7000mAh బ్యాటరీ ఫోన్ :
కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్ వెనుక వైపు డ్యూయల్ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ, మరో కెమెరాను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 18W ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh బ్యాటరీతో పనిచేస్తోంది.
కనెక్టివిటీ పరంగా ఈ హ్యాండ్‌సెట్ 4G LTE, Wi-Fi, బ్లూటూత్ 6.0, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ఫోన్ ప్రాక్సిమిటీ సెన్సర్, యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సర్ లు ఉన్నాయి. గూగుల్ జెమిని ఏఐ అసిస్టెంట్ ను కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ IP64 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లతో అందుబాటులో ఉంది. భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను కలిగి ఉంది.
మోటోరోలా G06 పవర్ ఫోన్‌తోపాటు మోటో G86 పవర్, మోటో G57 పవర్, మోటో G67 పవర్ వంటి మోడల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్‌లు కూడా భారీ బ్యాటరీలను కలిగి ఉన్నాయి.


Click it and Unblock the Notifications








