Home
Mobile

బడ్జెట్‌ ధరలో 7000mAh బ్యాటరీ, 6.88 అంగుళాల డిస్‌ప్లే, 50MP కెమెరాతో మోటో స్మార్ట్‌ఫోన్‌..!

మోటోరోలా నుంచి త్వరలో బడ్జెట్ ధరలో స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఇటీవలే మోటోరోలా ఇండియా X హ్యాండిల్ ద్వారా టీజర్‌ను విడుదల చేసింది. తాజాగా ఈ హ్యాండ్‌సెట్ పేరుతోపాటు విడుదల తేదీ సహా స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలను వెల్లడించింది. ఈ ఫోన్‌ భారీ డిస్‌ప్లే, భారీ బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌ పూర్తి వివరాలు.

ఎప్పుడు విడుదల కానుంది? :
మోటోరోలా అక్టోబర్‌ 7 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు మోటో G06 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ను (Moto G06 Power Smartphone) లాంచ్ చేస్తున్నట్లు ప్రకటన చేసింది. విడుదల అనంతరం ఈ హ్యాండ్‌సెట్ మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌తోపాటు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా అందుబాటులోకి రానుంది. ఫ్లిప్‌కార్ట్‌ మైక్రోసైట్‌ ద్వారా ఈ ఫోన్‌ అనేక వివరాలు వెల్లడయ్యాయి.

Moto G06 Power Smartphone

మోటో G06 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌ల వివరాలు :
ఫ్లిప్‌కార్ట్‌ మైక్రోసైట్‌ ఆధారంగా మోటో G06 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ వేగాన్‌ లెదర్‌ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లేతో అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్ IP64 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంటుంది.

ఆండ్రాయిడ్ 15 స్మార్ట్‌ఫోన్ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ G81 ఎక్స్‌ట్రిమ్‌ చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. అయితే ఈ ఫోన్‌ ఎన్ని స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులోకి వస్తుందో వెల్లడి కాలేదు. మైక్రో SD కార్డు ద్వారా స్టోరేజీని పొడిగించుకొనే అవకాశం ఉంది.

భారీ బ్యాటరీ, క్వాడ్ పిక్సల్‌ కెమెరా :
ఈ హ్యాండ్‌సెట్ ఏకంగా 7000mAh భారీ బ్యాటరీతో లాంచ్‌ కానుంది. ఒక్కసారి ఛార్జింగ్ చేసి ఏకంగా మూడు రోజులపాటు ఉపయోగించుకోవచ్చని చెబుతోంది. కెమెరా విభాగం పరంగా ఈ హ్యాండ్‌సెట్‌ వెనుక వైపు 50MP క్వాడ్‌ పిక్సల్ కెమెరా సిస్టమ్‌, ముందు వైపు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంటుంది.

ఎంత ధరలో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది :
దీంతోపాటు మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్‌ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌ 3.5mm హెడ్‌ఫోన్‌ జాక్‌ను కూడా కలిగి ఉంటుంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ రూ.10 వేల నుంచి రూ.15 వేల ధరలో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

మోటో G86 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ :
ఇటీవలే మోటోరోలా నుంచి భారత్‌ మార్కెట్‌లోకి మోటో G86 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. ఈ ఫోన్ MIL STD 810H మిలిటరీ గ్రేడ్‌ సర్టిఫికేషన్‌లను కలిగి ఉంది. 6.7 అంగుళాల సూపర్‌ HD అమోలెడ్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7i ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది.

ఈ ఫోన్‌ 4nm ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7400 SoC చిప్‌సెట్‌, ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తోంది. 33W టర్బోపవర్‌ ఛార్జింగ్ సపోర్టుతో 6720mAh బ్యాటరీతో పనిచేస్తోంది. కెమెరా విభాగం పరంగా 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా, 8MP అల్ట్రావైడ్‌ లెన్స్‌, 3 ఇన్ 1 ఫ్లిక్కర్‌ సెన్సార్‌ అమర్చి ఉంది. 32MP కెమెరాను కలిగి ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto G06 Power Smartphone with 7000mAh battery confirmed to launch on october 7 in india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X