Home
Mobile

రూ.7499 ధరకే 7000mAh భారీ బ్యాటరీ, 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లే, 50MP కెమెరా ఫోన్‌..!

మోటోరోలా భారత్ మార్కెట్‌ లో ఇవాళ మోటో G06 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ ను (Moto G06 Power Smartphone launched) లాంచ్‌ చేసింది. ఎంట్రీ లెవల్‌ ధరలో ఈ ఫోన్‌ ను విడుదల చేసింది. ఈ హ్యాండ్‌సెట్ 7000mAh భారీ బ్యాటరీ, 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లే, 50MP కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు వేగాన్ లెదర్‌ బ్యాక్‌ ప్యానల్‌ ను కలిగి ఉంది. ఈ మోటో స్మార్ట్‌ఫోన్‌ పూర్తి స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, సేల్‌ వివరాలు.

మోటో G06 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.88 అంగుళాల HD+ (720 x 1640 పిక్సల్స్‌) భారీ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రీఫ్రెష్‌ రేట్‌, 600 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్, 395ppi పిక్సల్‌ డెన్సిటీని కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్‌ 3 ప్రొటెక్షన్‌ ను పొందుతుంది.

Moto G06 Power Smartphone launch telugu news

ఈ మోటో G06 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ మీడియాటెక్‌ హీలియో G81 ఎక్స్‌ట్రీమ్‌ SoC ప్రాసెసర్‌ పైన పనిచేస్తుంది. ఈ ఫోన్ 4GB ర్యామ్, 64GB స్టోరేజీని తో జతచేసి ఉంటుంది. మైక్రో SD కార్డుతో 1TB వరకు స్టోరేజీని పెంచుకొనేందుకు అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తుంది.

భారీ బ్యాటరీ స్మార్ట్‌ఫోన్ :
ఈ స్మార్ట్‌ఫోన్ 18W ఛార్జింగ్‌ సపోర్టుతో 7000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 65 గంటల ప్లేబ్యాక్‌ టైమ్‌ ను పొందవచ్చని మోటో చెబుతోంది. కెమెరా విభాగం పరంగా ఈ ఫోన్ f/1.8 అపేచర్‌ తో 50MP ప్రైమరీ కెమెరా, మరో సెన్సర్‌ను కలిగి ఉంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 8MP కెమెరాను అమర్చారు.

కనెక్టివిటీ పరంగా మోటో G06 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ 4G LTE, బ్లూటూత్ 6.0, వైఫై, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. యాక్సెలిరోమీటర్‌, యాంబియంట్‌ లైట్‌ సెన్సర్‌, ప్రాక్సిమిటీ సెన్సర్‌ ను కలిగి ఉంటుంది. భద్రత కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్ ప్రింట్ సెన్సర్‌ ను అమర్చారు.

Moto G06 Power Smartphone launch telugu news

IP64 రేటింగ్‌ :
ఈ స్మార్ట్‌ఫోన్‌ వేగాన్‌ లెదర్‌, ప్లాస్టిక్‌ ఫ్రేమ్‌ ను కలిగి ఉంటుంది. IP64 రేటింగ్‌ తో డస్ట్‌, స్ల్పాష్‌ రెసిస్టెంట్‌ గా ఉంది. మెరుగైన ఆడియో కోసం డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్‌ లను కలిగి ఉంది. గూగుల్‌ జెమిని AI అసిస్టెంట్‌ ను కలిగి ఉంటుంది.

మోటో G06 పవర్‌ స్మార్ట్‌ఫోన్‌ ధర, సేల్ వివరాలు :
ఈ స్మార్ట్‌ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7499 గా ఉంది. అక్టోబర్‌ 11 నుంచి సేల్‌ ప్రారంభం కానుంది. మోటోరోలా ఇండియా వెబ్‌సైట్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఇతర రిటైల్‌ స్టోర్స్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. పాంటోన్ లారెల్‌ ఓక్‌, పాంటోన్‌ టెండ్రిల్‌, పాంటోన్‌ టేప్‌స్ట్రీ కలర్‌ వేరియంట్స్‌ లో లభిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Moto G06 Power Smartphone with 7000mAh battery launched in india at Rs7499 price
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X