రూ.7499 కే 7000mAh భారీ బ్యాటరీ, భారీ డిస్‌ప్లే స్మార్ట్‌ఫోన్.. ఇవాళ్టి నుంచే సేల్..!
భారత్ మార్కెట్ లో మోటోరోలా సంస్థ 7000mAh భారీ బ్యాటరీ, 6.88 అంగుళాల భారీ డిస్‌ప్లేతో మోటో G06 పవర్ స్మార్ట్‌ఫోన్ ను ఇటీవల లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ వేగాన్ లెదర్ బ్యాక్ ప్యానల్ ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఎంట్రీ లెవల్ ధరలోనే అందుబాటులోకి వచ్చింది. ఈ ఫోన్ సేల్ (Moto G06 Power Smartphone Sale) ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. ఈ భారీ బ్యాటరీ మోటోరోలా స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, సేల్ పూర్తి వివరాలు.
మోటో G06 పవర్ స్మార్ట్‌ఫోన్ సేల్ వివరాలు :
ఈ మోటోరోలా స్మార్ట్ ఫోన్ 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ వేరియంట్ ధర రూ.7499 గా ఉంది. ఇవాళ్టి నుంచే (అక్టోబర్ 11 వ తేదీ) ఈ ఫోన్ ను కొనుగోలు చేయవచ్చు. మోటోరోలా ఇండియా వెబ్‌సైట్ (motorola.in), ఫ్లిప్‌కార్ట్ (Flipkart), రిటైల్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.

6.88 అంగుళాల భారీ డిస్‌ప్లే :
మోటో G06 పవర్ స్మార్ట్‌ఫోన్ 120Hz రీఫ్రెష్ రేట్ తో 6.88 అంగుళాల HD+ భారీ డిస్‌ప్లేతో అందుబాటులోకి వచ్చింది. ఈ డిస్‌ప్లే 600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ ను పొందుతుంది.
వేగాన్ లెదర్, ఆండ్రాయిడ్ 15 OS :
ఈ మోటోరోలా ఫోన్ వేగాన్ లెదర్, ప్లాస్టిక్ ఫ్రేమ్ ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హీలియో G81 ఎక్స్‌ట్రీమ్ SoC ప్రాసెసర్ ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 15 ఆధారిత Hello UI పైన పనిచేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ గూగుల్ జెమిని AI అసిస్టెంట్ ను కలిగి ఉంది.

7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరా :
ఈ మోటో స్మార్ట్‌ఫోన్ కెమెరా విభాగం పరంగా 50MP ప్రైమరీ కెమెరా, మరో కెమెరా తోపాటు 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. అదే విధంగా 18W ఛార్జింగ్ సపోర్టుతో 7000mAh భారీ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది. ఈ హ్యాండ్‌సెట్ ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి 65 గంటల ప్లేబ్యాక్ టైమ్ ను పొందవచ్చని మోటో తెలిపింది.
IP64 రేటింగ్, డాల్బీ అట్మాస్ సపోర్టు :
ఈ హ్యాండ్‌సెట్ సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ ను కలిగి ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్టుతో స్టీరియో స్పీకర్ లను కలిగి ఉంది. 4G LTE, బ్లూటూత్ 6.0, Wi-Fi, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది.

ఈ మోటో G06 పవర్ స్మార్ట్‌ఫోన్ ప్రాక్సిమిటీ సెన్సర్, యాక్సెలిరోమీటర్, యాంబియంట్ లైట్ వంటి సెన్సర్ లను కలిగి ఉంది. మరియు IP64 రేటింగ్ తో డస్ట్, స్ల్పాష్ రెసిస్టెంట్ గా ఉంది. పాంటోన్ టెండ్రిల్, పాంటోన్ టేప్‌స్ట్రీ, పాంటోన్ లారెల్ ఓక్ వంటి మూడు కలర్ వేరియంట్స్ లో లభిస్తుంది.


Click it and Unblock the Notifications








