మోటో G31 స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్స్ ప్రారంభం అయ్యాయి!! తగ్గింపు ఆఫర్స్ మిస్ అవ్వకండి...

|

Lenovo యాజమాన్యంలోని మోటోరోలా బ్రాండ్ ఇటీవల నవంబర్ 29న భారతదేశంలో మోటో G31 బడ్జెట్ ఆధారిత స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ యొక్క అమ్మకాలు మొదటిసారిగా భారతదేశంలో ఈరోజు మొదలుకానున్నాయి. మోటోరోలా బ్రాండ్ యొక్క ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకంగా Flipkartలో విక్రయించబడుతుంది. MediaTek Helio G85 SoC మరియు 6GB ర్యామ్ మరియు 128GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్ వంటి ఫీచర్లతో లభిస్తుంది. అలాగే ఇది 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉండడమే కాకుండా ఇది 20W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

మోటో G31 స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

మోటో G31 స్మార్ట్‌ఫోన్ ధరల వివరాలు

గత వారం ఇండియాలో లాంచ్ చేయబడిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మోటో G31 ఈరోజు మధ్యాహ్నం 12pm IST నుంచి వినియోగదారులు కొనుగోలు చేయడానికి మొదటిసారి Flipkartలో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. ఇది రెండు ర్యామ్ + స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లలో అందించబడుతుంది. 4GB RAM + 64GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.12,999 కాగా 6GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ రూ. 14,999 ధర వద్ద అందుబాటులో ఉంటుంది. ఇది ఫ్లిప్ కార్ట్ లో బేబీ బ్లూ మరియు మెటోరైట్ గ్రే కలర్ ఆప్షన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

Vi టారిఫ్ పెంపు తర్వాత డిస్నీ+ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో ఆకర్షణీయమైన ప్లాన్‌లుVi టారిఫ్ పెంపు తర్వాత డిస్నీ+ హాట్‌స్టార్ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌తో ఆకర్షణీయమైన ప్లాన్‌లు

మోటో G31 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్
 

మోటో G31 స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్

మోటో G31 స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది హైబ్రిడ్ డ్యూయల్-సిమ్ (నానో + నానో/ మైక్రో SD కార్డ్) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్11 ద్వారా రన్ అవుతుంది. ఇది 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.4-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) AMOLED హోల్-పంచ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 409ppi పిక్సెల్ సాంద్రత మరియు 20:9 కారక నిష్పత్తితో లభిస్తుంది. హుడ్ కింద ఇది ఆర్మ్ మాలి-G52 MC2 GPUతో జత చేయబడిన MediaTek Helio G85 SoCని మరియు 6GB వరకు RAMని పొందుతుంది. Moto G31 కూడా 128GB వరకు ఆన్‌బోర్డ్ నిల్వను పొందుతుంది. దీనిని మైక్రో SD కార్డ్ (1TB వరకు) ద్వారా మరింత విస్తరించవచ్చు.

ఆప్టిక్స్

మోటో G31 స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో f/1.8 అపెర్చర్ లెన్స్, PDAF మరియు క్వాడ్-పిక్సెల్ టెక్నాలజీతో కూడిన 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ హెడ్‌లైన్డ్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అదనంగా ఇది f/2.2 ఎపర్చరుతో 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ మరియు 118-డిగ్రీల ఫీల్డ్-ఆఫ్-వ్యూతో పాటు f/2.4 ఎపర్చరు లెన్స్‌తో 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌ను కూడా పొందుతుంది. సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ముందుభాగంలో f/2.2 ఎపర్చరు లెన్స్‌తో 13-మెగాపిక్సెల్ సెల్ఫీ సెన్సార్‌ను కలిగి ఉంది.

ఫాస్ట్ ఛార్జింగ్‌

మోటో G31 స్మార్ట్‌ఫోన్ ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఇది 20W TurboPower ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో కూడిన 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేయబడి వస్తుంది. ఈ బ్యాటరీ 36 గంటల వరకు బ్యాక్ అప్ ను కలిగి ఉంటుందని పేర్కొన్నారు. కనెక్టివిటీ ఎంపికలలో 4G LTE, FM రేడియో, 3.5mm ఆడియో జాక్, బ్లూటూత్ v5, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi 802.11 ac, USB టైప్-C పోర్ట్, GPS, GLONASS మరియు మరిన్ని ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో ఫింగర్‌ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ సెన్సార్, సామీప్య సెన్సార్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, SAR సెన్సార్, గైరోస్కోప్ మరియు ఇ-కంపాస్ ఉన్నాయి. దీని కొలతలు 161.89x74.60x8.45mm మరియు బరువు 180 గ్రాములు.

Best Mobiles in India

English summary
Moto G31 Budget Smartphone First Sale Live on Flipkart India: Price, Specs, Sale Offers and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X