Moto నుంచి మ‌రో మిడ్-రేంజ్ మొబైల్ విడుద‌ల‌.. ఫీచ‌ర్లపై లుక్కేయండి!

|

Motorola కంపెనీ మ‌రో కొత్త మోడ‌ల్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో విడుద‌ల చేసింది. Moto G32 పేరుతో మిడ్ రేంజ్ మొబైల్‌ను గురువారం గ్లోబ‌ల్ మార్కెట్లో విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం ఈ హ్యాండ్‌సెట్‌ను యూరోప్‌లోని ఎంపిక చేసిన మార్కెట్ల‌లో అందుబాటులోకి తెచ్చారు. ఈ స్మార్ట్‌ఫోన్ 6.5 అంగుళాల ఫుల్ HD డిస్‌ప్లేను క‌లిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది.

 
Moto నుంచి మ‌రో మిడ్-రేంజ్ మొబైల్ విడుద‌ల‌.. ఫీచ‌ర్లపై లుక్కేయండి!

ఈ మొబైల్‌ డాల్బీ అట్మోస్ ద్వారా మెరుగుపరచబడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో కూడా అమర్చబడింది. అంతేకాకుండా దీనికి octa-core Snapdragon 680 SoC ప్రాసెస‌ర్ అందిస్తున్నారు. ఈ మొబైల్‌కు 50 మెగాపిక్సెల్ క్లారిటీ గ‌ల కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తుంది. ఇప్పుడు ఈ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేష‌న్లు, ఫీచ‌ర్లు, ధ‌ర‌ల‌ను తెలుసుకుందాం.

ఈ Moto G32 ధ‌ర‌లు:
ఈ Moto G32 ని మిడ్ రేంజ్ ధ‌ర‌లో విడుద‌ల చేశారు. యూరోపియ‌న్ మార్కెట్లో దీని 4G RAM + 128GB స్టోరేజీ వేరియంట్ ధ‌ర‌ను 209.99 యూరోలుగా నిర్ణ‌యించారు. భార‌త క‌రెన్సీ ప్ర‌కారం దాదాపు రూ.17 వేల వ‌ర‌కు ఉండొచ్చ‌ని అంచ‌నా. ఇది మిన‌ర‌ల్ గ్రే, స‌టిన్ సిల్వ‌ర్ క‌ల‌ర్ల‌లో వినియోగ‌దారుల‌కు కొనుగోలుకు అందుబాటులో ఉంది. మోటరోలా త్వరలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాటిన్ అమెరికన్ మరియు భారతీయ మార్కెట్లలో కూడా విడుదల చేయనుంది.

Moto G32 ఫీచ‌ర్లు, స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.5 అంగుళాల full-HD (1,080x2,400 pixels) రిసొల్యూష‌న్ గ‌ల‌ LCDడిస్‌ప్లే ను అందిస్తున్నారు. హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే అత్య‌ధికంగా 90Hz రిఫ్రెష్ రేటును క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 12 ఆధారిత ఓఎస్‌పై ప‌ని చేస్తుంది. ఈ ఫోన్ octa-core MediaTek Helio H35 SoC ప్రాసెస‌ర్ ను క‌లిగి ఉంది.

ఈ మొబైల్ 4GB RAM| 128GB స్టోరేజీ కెపాసిటీలో అందుబాటులో ఉంది. ఇక కెమెరాల విష‌యానికొస్తే.. ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్ మ‌రియు ఎల్ఈడీ ఫ్లాష్‌ క‌లిగి ఉంది. ఈ ఫోన్‌కు 50 మెగా పిక్సెల్ క్వాలిటీ గల ప్ర‌ధాన కెమెరా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. మ‌రొక‌టి 8 మెగాపిక్సెల్ క్వాలిటీలో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్‌, చివ‌రిది 2 మెగా పిక్సెల్ క్వాలిటీతో మాక్రో లెన్స్ క‌లిగి ఉంది. సెల్ఫీ మ‌రియు వీడియో కాల్ కోసం ముందు వైపు 16 మెగా పిక్సెల్ క్వాలిటీతో ఫ్రంట్ క్యామ్ ఇస్తున్నారు.

Moto నుంచి మ‌రో మిడ్-రేంజ్ మొబైల్ విడుద‌ల‌.. ఫీచ‌ర్లపై లుక్కేయండి!

ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది 30W ఫాస్ట్‌ ఛార్జింగ్ స‌పోర్ట్ క‌లిగి ఉంటుంది. కనెక్టివిటీ పరంగా, కొత్త Moto G32 వేరియంట్ డ్యూయల్-సిమ్ స్లాట్‌లు, Wi-Fi, బ్లూటూత్ 5.2, A-GPS, NFC, USB టైప్-C , 3.5ఎంఎం హెడ్‌సెట్ జాక్‌పోర్ట్ క‌లిగి ఉంది.

ఇకపోతే, భార‌త్‌లో ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న Moto G82 5G స్మార్ట్‌ఫోన్ గురించి కూడా తెలుసుకుందాం:
ఈ Moto G82 5G స్మార్ట్‌ఫోన్ కూడా మిడ్ రేంజ్ కేట‌గిరీలోనే విడుద‌లైంది. ఈ మోటో ఫోన్ 120Hz AMOLED డిస్‌ప్లే మరియు ట్రిపుల్ రియర్ కెమెరా ఫీచర్లను కలిగి ఉండడంతో పాటుగా ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 SoCతో రన్ అవుతూ 8GB వరకు RAMతో జతచేయబడి వస్తుంది. కేవలం 173 గ్రాముల బరువుతో లభించే తేలికైన ఫోన్ ఇండియాలోని 5G స్మార్ట్‌ఫోన్ విభాగంలో రెడ్మీ నోట్ 11 ప్రో+, వన్‌ప్లస్ నార్డ్ CE 2 లైట్ మరియు వివో T1 వంటి వాటితో గట్టి పోటీని ఎదురుకోనున్నది. దీని యొక్క ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్ల వివరాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 
Moto నుంచి మ‌రో మిడ్-రేంజ్ మొబైల్ విడుద‌ల‌.. ఫీచ‌ర్లపై లుక్కేయండి!

Moto G82 5G స్మార్ట్‌ఫోన్ ధరలు:
మోటరోలా యొక్క కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ మోటో G82 5G ఇండియాలో రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో 6GB RAM + 128GB స్టోరేజ్ బేస్ వేరియంట్ యొక్క ధర రూ.21,499 కాగా 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌ మోడల్ రూ.22,999 ధర వద్ద మెటోరైట్ గ్రే మరియు వైట్ లిల్లీ వంటి కలర్ ఎంపికలలో లభిస్తుంది.

Moto G82 5G స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ వివరాలు:
మోటో G82 5G స్మార్ట్‌ఫోన్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది డ్యూయల్-సిమ్ (నానో) స్లాట్ కలిగి ఉండి ఆండ్రాయిడ్ 12తో రన్ అవుతుంది. ఇది 20:9 యాస్పెక్ట్ రేషియో మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.6-అంగుళాల ఫుల్-HD+ (1,080x2,400 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. అలాగే హుడ్ కింద స్నాప్‌డ్రాగన్ 695 SoC తో శక్తిని పొందుతూ 8GB వరకు LPDDR4X RAMతో జతచేయబడి లభిస్తుంది.

Moto నుంచి మ‌రో మిడ్-రేంజ్ మొబైల్ విడుద‌ల‌.. ఫీచ‌ర్లపై లుక్కేయండి!

Moto G82 5G స్మార్ట్‌ఫోన్ యొక్క ఆప్టిక్స్ విషయానికి వస్తే ఫ్యూన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS) మద్దతుతో పాటుగా f/1.8 లెన్స్‌తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను కలిగి ఉంది. కెమెరా సెటప్‌లో అల్ట్రా-వైడ్ షూటర్ & డెప్త్ సెన్సార్‌గా 8-మెగాపిక్సెల్ మరియు 2-మెగాపిక్సెల్ మాక్రో షూటర్‌ కెమెరాలు ఉన్నాయి. సెల్ఫీలు మరియు వీడియో చాట్ కోసం ఫోన్ ముందు భాగంలో f/2.2 లెన్స్‌తో 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా సెన్సార్‌ను కలిగి ఉంది.

Moto G82 5G స్మార్ట్‌ఫోన్ యొక్క కనెక్టివిటీ ఎంపికలలో 5G, 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.1, GPS/ A-GPS, NFC, USB టైప్-C మరియు 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటివి ఉన్నాయి. బోర్డులోని సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, సామీప్య సెన్సార్ మరియు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వంటివి ఉన్నాయి. దీనితో పాటుగా ఇది డాల్బీ అట్మోస్ మద్దతుతో డ్యుయల్ స్టీరియో స్పీకర్‌లను కలిగి ఉంటాయి. ఇది 128GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది. ఇది మైక్రో SD కార్డ్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించడానికి మద్దతున ఇస్తుంది. చివరిగా ఇది 30W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతుతో 5,000mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Moto G32 With 6.5-Inch Full-HD+ 90Hz Display, 50-Megapixel Camera Launched: Price, Specifications

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X