భార‌త మార్కెట్లో Moto G32 విడుద‌ల‌.. ధ‌ర‌, ఫీచ‌ర్లు చూడండి!

|

మోటో కంపెనీ భార‌త మార్కెట్‌కు మ‌రో కొత్త మొబైల్‌ను ప‌రిచ‌యం చేసింది. Moto G32 పేరుతో స‌రికొత్త స్మార్ట్‌ఫోన్‌ను మంగ‌ళ‌వారం భార‌త మార్కెట్లో విడుద‌ల చేసింది. ఈ మొబైల్ ప‌లు అప్‌గ్రేడెడ్ వ‌ర్ష‌న్ ఫీచ‌ర్ల‌తో యూజ‌ర్ల ముందుకు వస్తోంది. దీనికి Snapdragon 680 SoC ప్రాసెస‌ర్‌ను అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ 6.5 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేతో 90Hz రిఫ్రెష్ రేటుతో వ‌స్తోంది. అంతేకాకుండా దీనికి 5,000mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇక పూర్తి స్థాయిలో ఫీచ‌ర్లు, స్పెసిఫికేషన్లు, ధ‌ర‌ల వివ‌రాల‌ను కూడా తెలుసుకుందాం.

 Moto G32

భార‌త్‌లో Moto G32 ధ‌ర‌లు:
భార‌త మార్కెట్లో Moto G32 మొబైల్స్‌ 4GB RAM + 64GB స్టోరేజీ ధ‌ర‌ను రూ.12,999 గా నిర్ణ‌యించారు. భార‌త మార్కెట్లో ఇవి మిన‌ర‌ల్ గ్రే, సాటిన్ సిల్వ‌ర్ క‌ల‌ర్ల‌లో అందుబాటులో ఉండ‌నున్నాయి. ఆగ‌స్టు 16వ తేదీ నుంచి ఇవి భార‌త్‌లో యూజ‌ర్ల‌కు కొనుగోలుకు అందుబాటులోకి వ‌స్తాయి. ఫ్లిప్ కార్ట్ వేదిక‌గా ఇవి అందుబాటులోకి రానున్నాయి.

HDFC బ్యాంక్ కార్డ్ వినియోగదారులు 10 శాతం తక్షణ తగ్గింపుతో రూ.11,749 కు పొంద‌వ‌చ్చు. జియో ఆఫర్ లో భాగంగా కస్టమర్ రీఛార్జ్‌లపై రూ.2,000 క్యాష్‌బ్యాక్ పొంద‌వ‌చ్చు.

Moto G32 స్పెసిఫికేష‌న్లు:
ఈ మొబైల్ కు 6.5 అంగుళాల (1,080x2,400 pixels) రిసొల్యూష‌న్‌తో full-HD LCD డిస్‌ప్లే పానెల్‌ను అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఇది 90Hz రిఫ్రెష్ రేటుతో ప‌ని చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ Snapdragon 680 SoC ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం. ఇది ఆండ్రాయిడ్ 12 ఆధారంగా ర‌న్ అవుతుంది. ఇక ర్యామ్ విష‌యానికొస్తే.. ఈ హ్యాండ్‌సెట్‌కు 4GB of RAM+64GB అందిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

 Moto G32

ఈ మొబైల్ ట్రిపుల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉండ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధాన కెమెరా 50-మెగాపిక్సెల్ క్వాలిటీలో f/1.8అప‌ర్చ‌ర్ లెన్స్ ప్రైమ‌రీ కెమెరాగా అందిస్తున్నారు. ఇక మిగ‌తా రెండు కెమెరాల్లో ఒక‌టి 8 మెగాపిక్సెల్ క్వాలిటీతో f/2.2 అల్ట్రా వైడ్ లెన్స్‌, మ‌రొక‌టి 2 మెగాపిక్సెల్ క్వాలిటీతో f/2.4 అప‌ర్చ‌ర్‌ మాక్రో షాట్స్ లెన్స్ ఇస్తున్నారు. ఇక వీడియో కాలింగ్ సెల్ఫీ విష‌యానికొస్తే.. 16 మెగాపిక్సెల్ క్వాలిటీ గ‌ల లెన్స్ ఫ్రంట్ క్యాం కు ఇస్తున్నారు.

ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 5000 mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీ 33W ఫాస్ట్ ఛార్జింగ్ స‌పోర్ట్‌ అందిస్తున్నారు. ఈ హ్యాండ్ సెట్ డ్యుయ‌ల్ సిమ్ స్లాట్స్‌, రెండిటికీ 5జీ నెట్‌వ‌ర్క్ స‌పోర్ట్ సిస్ట‌మ్ కలిగి ఉంది. క‌నెక్టివిటీ ప‌రంగా.. Wi-Fi, 4G LTE, బ్లూటూత్ v5.2, 3.5mm హెడ్‌ఫోన్ పోర్ట్‌, USB Type-C ఫీచ‌ర్ల‌ను క‌లిగి ఉంది. అంతేకాకుండా, స్మార్ట్‌ఫోన్ స్పోర్ట్స్ స్టీరియో స్పీకర్‌లతో పాటు డాల్బీ అట్మాస్‌తో కూడా ఉంటుంది.

 Moto G32

భార‌త్‌లో ఇప్ప‌టికే అందుబాటులో ఉన్న MOTOROLA Edge 20 Pro ధ‌ర‌లు, స్పెసిఫికేష‌న్లు కూడా తెలుసుకుందాం:

ఈ మొబైల్ కు 6.7 అంగుళాల లార్జ్ డిస్‌ప్లేను క‌లిగి ఉంది. ఇది Qualcomm SM8250-AC Snapdragon 870 5G (7 nm) ప్రాసెస‌ర్‌ను క‌లిగి ఉంది. ఇది 8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 4500mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు. ఇది డ్యుయ‌ల్ సిమ్ స‌దుపాయాన్ని క‌లిగి ఉంది. 8 GB RAM | 128 GB ROM వేరియంట్ ధ‌ర ప్ర‌స్తుతం ఫ్లిప్ కార్ట్‌లో రూ.34,999 గా కొనుగోలు దారుల‌కు అందుబాటులో ఉంది.

Best Mobiles in India

English summary
Moto G32 With Snapdragon 680 SoC, ThinkShield Security Launched in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X